మూడో భార్యను కాలితో తన్నిన నరేష్.. మళ్లీ పెళ్లి ట్రైలర్ లో ఇన్ని ట్విస్టులా?

సీనియర్ నటుడు నరేష్( Naresh ), పవిత్ర లోకేశ్( pavitra lokesh ) ప్రేమలో ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చిన సమయంలో ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేశారు.

పవిత్ర లోకేశ్ పరువుకు భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.

అటు నరేష్ ఇటు పవిత్ర లోకేశ్ పై రమ్య రఘుపతి( Ramya Ragupathi ) సంచలన ఆరోపణలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

అయితే తాజాగా మళ్లీ పెళ్లి( Malli Pelli) సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు నరేష్ రియల్ లైఫ్ ను ట్రైలర్ లో దించేశారని కామెంట్లు చేస్తున్నారు.ఈ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా ట్రైలర్ లో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండటంతో పాటు మూడో భార్య పాత్రను పోషించిన వనితా విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar )ను నరేష్ తన్నడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.నరేష్ నిజ జీవితంలో రమ్య రఘుపతి విషయంలో ఇదే విధంగా ప్రవర్తించాడా? అనే కామెంట్లు వినిపించాయి.నరేష్, పవిత్ర లోకేశ్ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి సైతం ట్రైలర్ లో పరోక్షంగా సెటైర్లు వేశారు.

తెలుగు( Telugu ) కన్నడ( Kannada ) భాషల్లో ఈ సినిమా రిలీజవుతోంది.పాత్రల పేర్లు స్వల్పంగా మార్చినా తనపై వచ్చిన అన్ని విమర్శలకు ఈ సినిమా ద్వారా జవాబు చెప్పాలని నరేష్ భావిస్తున్నట్టు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.

Advertisement

నరేష్ నిజ జీవితాన్ని గుర్తు చేసే విధంగా ఈ సినిమా ట్రైలర్ లో డైలాగ్స్ ఉన్నాయి.ఈ నెల 26వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఎం.

ఎస్.రాజు( M.s Raju ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.ట్రైలర్ లోనే ఊహించని ట్విస్టులు ఉండగా సినిమాలో ఏ స్థాయిలో ట్విస్టులు ఉంటాయో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు