సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోలు అందరు సరసన నటించిన వారిలో సీనియర్ దివంగత నటి శ్రీదేవి ఒకరు.ఈమె సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన అద్భుతమైన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.
నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శ్రీదేవి ( Sridevi ) మరణం ఇప్పటికీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి ఇక శ్రీదేవి మరణం తర్వాత తన వారసురాలుగా తన పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు.
శ్రీదేవి బ్రతికున్నప్పుడే ఈమె ధడక్ సినిమాకు కమిట్ అయ్యారు సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే శ్రీదేవి మరణించారు.ఇలా శ్రీదేవికి తెరపై తన కూతురిని చూసే అవకాశం లభించలేదని చెప్పాలి.ఇక శ్రీదేవి తన కూతుర్ల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతలు పంచి వారిలో సరైన క్రమశిక్షణను అలవాటు చేశారు.
చిన్నప్పటి నుంచి కూడా శ్రీదేవి తన పిల్లలను ఎంతో పద్ధతిగా పెంచారు అయితే ఎప్పుడైతే తాను చనిపోయారు అప్పటినుంచి తన పిల్లలకు ఎవరు కూడా అడ్డు చెప్పేవారు లేకపోవడంతో విచ్చలవిడిగా వారి జీవితాన్ని వారు ఎంజాయ్ చేస్తున్నారు.
శ్రీదేవి మరణం తర్వాత బోనీ కపూర్( Boney Kapoor ) కూడా తనకు తోచిన సినిమాలు చేసుకుంటూ తన జీవితాన్ని తాను బ్రతుకుతున్నారు కానీ ఒక తండ్రిగా పిల్లలకు ఇది చెడు ఇది మంచి అని చెప్పే స్థితిలో కూడా ఆయన లేరని కొందరు బోనీకపూర్ వ్యవహార శైలి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక శ్రీదేవి మరణించిన తర్వాత జాన్వీ, ఖుషి కపూర్( Kushi Kapoor ) ఇద్దరూ కూడా చెడు అలవాట్లకు బానిసలుగా మారారు.జాన్వీ పెద్ద ఎత్తున సిగరెట్లు తాగుతూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు.
అలాగే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఎక్స్పోజింగ్లు చేస్తూ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు.
జీవితం అంటే ఇంతే అనే ధోరణిలో ఈ అక్క చెల్లెలు ఇద్దరు బ్రతుకుతున్నారని చెప్పాలి.ఇలా తన అభిమాని నటి కూతుర్లు ఈ విధంగా వ్యవహరించడంతో ఎంతో మధనపడుతున్నటువంటి శ్రీదేవి అభిమానులు వీరి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శ్రీదేవి ఉన్నపుడు ఎంతో పద్ధతిగా ఉన్నటువంటి వీళ్ళు శ్రీదేవి మరణం తర్వాత ఇలా హద్దులు మీరారని, శ్రీదేవి కనుక ఉండి ఉంటే వీరీ పరిస్థితి మరోలా ఉండేదని భావిస్తున్నారు.
ఒకవేళ శ్రీదేవి కనుక బ్రతికే ఉంటే తన కూతుర్ల ప్రవర్తనకు నరికి పోగులు పెట్టేది అంటూ కొందరు వీరి వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు.ఇక జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తే హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే ఈమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కాబోతున్నారు.సౌత్ ఇండస్ట్రీలో దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర( Devara ) సినిమాలో ఈమె హీరోయిన్గా నటించే అవకాశం అందుకున్నారు.
ఈ సినిమా ద్వారా ఆమె సౌత్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవులలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.