సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవారికి మాత్రమే సినిమా అవకాశాలు తొందరగా వస్తాయని వారు తమ టాలెంట్ నిరూపించుకుంటే ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలుగా మారవచ్చు అని చాలామంది భావిస్తూ ఉంటారు.అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీకి పెద్దగా మారినటువంటి వారిలో నటుడు చిరంజీవి ( Chiranjeevi ) ఒకరు.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చిరంజీవికి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేదు అయితే ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.

ఇక చిరంజీవి బాటలోనే ఎంతోమంది మెగా కాంపౌండ్ నుంచి హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్( Ram Charan) చిరుత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయమయ్యారు.మొదటి సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ అనంతరం మగధీర( Magadheera )తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.ఇక ఈయన కూడా తండ్రికి తగ్గ తనయుడు అన్న పేరు సంపాదించుకొని ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారు.
అయితే ప్రస్తుతం చిరంజీవిని మించి ఈయన ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా గుర్తింపు పొందారని చెప్పాలి.

ఇక ఇండస్ట్రీలోకి రాంచరణ్( Ram Charan) హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆయనపై ఓ టాలీవుడ్ హీరోయిన్ మోజుపడ్డారట.ఎంతో స్టార్ హీరోగా మారినటువంటి రామ్ చరణ్ మరొక స్టార్ హీరో కొడుకు కావడంతో ఆ ఇంటికి కోడలు కావాలన్న ఉద్దేశంతో ఆమె ఎవరు చేయని పనులను చేశారంటూ ఓ వార్త సంచలనంగా మారింది.మెగా ఇంటికి కోడలు కావాలన్న ఉద్దేశంతో ఆ హీరోయిన్ చాలా చీప్ పనులను కూడా చేశారట.
రామ్ చరణ్ తో తనకు ఎఫైర్ ఉన్నట్లు డబ్బులు ఇచ్చి మరి ప్రమోషన్ చేయించుకున్నారని తెలుస్తుంది.

ఇలా తన టీం తో కలిసి ఆమె వారికి పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తూ రామ్ చరణ్తో తనకు ఏదో రిలేషన్ ఉంది అనే విధంగా వార్తలను సృష్టించే ప్రచారం చేయించారట వార్తలు ప్రచారం అయితే ఆ వార్తలను తాను సులభంగా నిజం చేసుకొని అవకాశం ఉంటుందన్న ఆలోచనలతో ఆమె ఈ విధమైనటువంటి చెత్త పనిచేసే ఆబాసుపాలు అయ్యారని తెలుస్తోంది.ఈ విషయం తెలిసి చిరంజీవి ఏకంగా ఆ హీరోయిన్ ఇంటికి పిలిపించి మరి తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చి మరి పంపించారట.దీంతో ఆమె ఈ వార్తలకు పులి స్టాప్ పెట్టడమే కాకుండా రామ్ చరణ్ కి కూడా చాలా దూరంగా ఉంది.
ఈమె రామ్ చరణ్ తో ( Ram Charan)కలిసి దాదాపు మూడు సినిమాల వరకు కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఇలా మూడు సినిమాలలో నటించడంతో చనువుగా ఉంటూ తానే స్వయంగా ఇలాంటి వార్తలను సృష్టించారని తెలిసి మెగా అభిమానులు కూడా ఆ హీరోయిన్ పై అసహనం వ్యక్తం.