ప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక నిమజ్జనంకు భక్తులు, ప్రజలు సహకరించాలి

శోభయాత్రలో డిజే లకి అనుమతి లేదు, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవుభక్తి శ్రద్దలతో ఒకే రోజులో నిమజ్జనం అయ్యే విధంగా భక్తులు గణేష్ మండప నిర్వహకులు సహకరించాలి.రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక విగ్రహాల నిమజ్జనంకు భక్తులు, ప్రజలు సహకరించాలని,నిమార్జనం రోజున డిజె లకు అనుమతి లేదని,భక్తి శ్రద్దలతో ఒకే రోజులో నిమజ్జనం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా అఖిల్ మహాజన( SP Akhil Mahajan ) పిలుపునిచ్చారు.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్ హాల్ లో సోమవారం టెక్స్ టైల్ పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ శాఖ, ప్రజా ప్రతినిధులు,హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, గణేష్ మండప నిర్వహకులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించడం జరిగింది.

 Devotees And People Should Cooperate For A Safe Vinayaka Immersion In A Peaceful-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో శాంతియుత వాతావరణం లో పండుగలను జరుపుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలువలన్నారు.గణేష్ శోభయాత్ర,మిలాద్ ఉన్ నబి పండుగలు( Eid e Milad un Nabi ) ఒకే రోజు రావడంతో శాంతి భద్రతల దృష్ట్యా ముస్లిం మత పెద్దలు పోలీస్ శాఖ వారి సూచనల మేరకు మిలాద్ ఉన్ నబి వేడుకలు అక్టోబర్ ఒకటవ తేదీన జరుపుకోవడానికి ఒప్పుకోవడం జరిగిందన్నారు.గణేష్ మండపల వద్ద తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఏ విధంగా పూజలు నిర్వహించరో అదేవిధంగా నిమజ్జనం రోజున కూడా భక్తి శ్రద్దలతో గణేష్ శోభాయాత్ర నిర్వహించుకోవాలే కానీ శోభయాత్రలో మద్యం సేవించి భక్తులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.

గణేష్ నిమజ్జనం రోజున గణేష్ శోభయాత్ర మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 12 లోపు పూర్తి అయ్యేలా భక్తులు, గణేష్ మండపాల నిర్వహకులు పోలీస్ వారికి సహకరించాలని, రెండు మూడు రోజుల పాటుగా నిమజ్జనం చేస్తూ ప్రజలకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి వచ్చే సంవత్సరం గణేష్ మండపానికి అనుమతి ఇవ్వడం జరగదు అని వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.గణేష్ శోభయాత్రలో డీజె లకు అనుమతి లేదని, జిల్లాలో డీజె యజమానులను బైండోవర్ చేయడం జరిగిందని, నిబంధనలు విరుద్ధంగా శోభయాత్రలో డి.జె పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.శోభయాత్రలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట భద్రత చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

అనంతరం టెక్స్ టైల్ పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ… గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ వారి సూచనలు, సలహాలు పాటిస్తూ ఆనందోత్సవాల మధ్య శోభయాత్ర జరుపుకోవాలని అన్నారు.అలాగే సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ శోభయాత్రలో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.

ఎక్కువ ఎత్తుగల విగ్రహాలు నిమజ్జనానికి తరలించేటప్పుడు విద్యుత్ తీగలు తగిలే ఆస్కారం ఉంటే మాకు సమాచారం అందిస్తే అట్టి ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపి వేయడం జరుగుతుంది అన్నారు.ఈ సమావేశంలో డిఎస్పీ ఉదయ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, టౌన్ సి.ఐ ఉపేందర్, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సారీ,ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు గణేష్ మండపాల నిర్వహకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube