షాకింగ్ న్యూస్: 181 ఏళ్లుగా జాడీలో దాచిపెట్టిన మనిషి తల... ఎవరిదంటే?

మనిషి తలేమిటి, 181 ఏళ్లుగా జాడీలో దాచి పెట్టడమేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే.అయితే ఈ సంఘటన మనదేశంలో కాదు, పోర్చుగల్ రాజధాని అయినటువంటి లిస్బన్‌లో ఓ వ్యక్తి తలను 181 ఏళ్లకు పైగా జాడీలో భద్రంగా దాచిపెట్టారు.

 Shocking News Human Head Hidden In A Jar For 181 Years ,mans Head , Skull, Glass-TeluguStop.com

అన్నేళ్లు ఆ తలను పరిరక్షిస్తున్నారంటే అది ఎవరిదో గొప్ప వ్యక్తిదే అయి ఉంటుంది… అని అనుకుంటున్నారా? అయితే మీ ఊహ తప్పు.అవును, అతను గొప్పవాడేమీ కాదు.

అత్యంత కిరాతకుడు.అవును, చాలా మంది అమాయకులను కనికరం లేకుండా చంపిన భయంకరమైన సీరియల్ కిల్లర్.

అతని పేరు డియాగో ఎల్విస్.అతని చేతిలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

స్పెయిన్‌లోని గెసెలియా నగరంలో 1819లో డియాగో జన్మించాడు.యుక్త వయసుకు వచ్చాక పని వెతుక్కుంటూ పోర్చుగల్‌లోని లిస్బన్‌కు చేరుకున్నాడు.ఇక్కడ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు.అయితే అతనికి ఉద్యోగం ఎక్కడా లభించలేదు.

దాంతో చిన్న చిన్న నేరాలు చేసే ముఠాతో కలిసి రద్దీ ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడేవాడు.ఆ డబ్బుతో జల్సాగా గడిపేవాడు.

తను మరింత ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని రైతులను టార్గెట్‌గా చేసుకున్నాడు.మార్కెట్‌లో తమ పంటను అమ్ముకుని డబ్బుతో ఇంటికి వెళ్లే రైతుల కోసం బ్రిడ్జిపై కాపు కాసేవాడు.

ఎవరైనా ఒంటరిగా వెళ్తున్నట్టు కనిపిస్తే అతడిని దోచుకుని చంపేసి, బ్రిడ్జిపై నుంచి కిందకు తోసేవాడు.అలా ఎంతో మందిని డియాగో పొట్టన పెట్టుకున్నాడు.

Telugu Diego Elvis, Glass, Latest, Skull-Latest News - Telugu

కాగా బ్రిడ్జి దగ్గర చనిపోయిన వారందరూ ఆత్మహత్యలు చేసుకుని ఉంటారని పోలీసులు అనుకునేవారు.పోస్ట్‌మార్టమ్ చేసి మృతికి అసలైన కారణం కనుక్కోవడం అప్పట్లో వీలయ్యేది కాదు.పంట నష్టం రావడంతో రైతులు ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పోలీసులు, అధికారులు అనుకునేవారు.దీంతో పోర్చుగల్ కోర్టు 1841లో డియాగోకు మరణ శిక్ష విధించింది.లిస్బన్‌లోని కొంతమంది వైద్యులు తమ పరిశోధన కోసం డియాగో మెదడు కావాలని కోర్టును, ప్రభుత్వాన్ని కోరారు.డియాగో మెదడును వైద్యులకు ఇచ్చేందుకు కోర్టు, ప్రభుత్వం అనుమతించాయి.

దీంతో అప్పటి నుంచి, అంటే 181 ఏళ్లుగా డియాగో తల లిస్బన్ విశ్వవిద్యాలయ మ్యూజియంలోనే ఉండిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube