కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్ లు బతికున్న నటీనటులను వ్యూస్ కోసం చంపేస్తుంటారు.దీంతో ఆ న్యూస్ చూసిన జనాలు, అభిమానులు నిజంగానే ఆ సెలెబ్రేటి చనిపోయారు అనుకోని తెగ బాధపడుతుంటారు.
అలా ఇప్పటికీ ఎంతోమంది నటీనటులను చనిపోయారు అని ప్రకటించడంతో తిరిగి ఆ నటినటును మేము బతికున్నామురో ముర్రో అంటూ చెప్పుకుంటారు.అలా తాజాగా మరో హీరోయిన్ పరిస్థితి కూడా అలాగే జరిగింది.
ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు. రష్మిక మందన.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న వారిలో కన్నడ బ్యూటీ రష్మిక మందన ఒకరు.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.పైగా ఇండియన్ క్రష్ గా కూడా ఒక టైటిల్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో ఈ అమ్మడు రేంజ్ హై లో ఉందని చెప్పవచ్చు.
తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2016లో కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో పరిచయమైంది.
ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక ఈ సినిమాతో తొలి నటనతో బాగానే మెప్పించింది.
ఆ తర్వాత అదే ఏడాది గీత గోవిందం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ఇక అలా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా అందులో సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక పాన్ ఇండియా మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి హిట్ సంపాదించుకుంది.ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.బాగా వర్కౌట్లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంటుంది.
తన పెట్స్ తో దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.
ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన అభిమానులతో సరదాగా లైవ్ లోకి వచ్చి ముచ్చట్లు పెడుతుంది.
కొన్ని కొన్ని సార్లు తనకు సంబంధించిన ఏదైనా ప్రశ్నలు వేయమని అభిమానులను అడుగుతుంది.అలా అభిమానులు దొరికిందే ఛాన్స్ అంటే తెగ ప్రశ్నలు వేస్తూ ఉంటారు.
అడగరాని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు.

తన సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు తన ఫ్యామిలీ విషయాలను తెగ షేర్ చేసుకుంటుంది ఈ కన్నడ బ్యూటీ.ఇక ఈ బ్యూటీ కేవలం సినిమాలలోనే కాకుండా అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటిస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే ఇటీవలే ఈ ముద్దుగుమ్మ చనిపోయింది అని ఒక మీమ్ బాగా వైరల్ గా మారింది.
దీంతో ఆ వార్త చూసిన తన అభిమానులు తట్టుకోలేకపోయారు.కానీ అది అంత అబద్ధమని తెలియడంతో.తన అభిమానులు ఆ మీమర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.







