విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదానికి కారణాలివే.. వాళ్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?

ఒకప్పుడు రైలు ప్రయాణం అంటే ఎంతో సేఫ్ అని ప్రజలు ఫీలయ్యేవారు.ఇప్పుడు మాత్రం రైలు ప్రయాణం అంటే ప్రాణాలు పోతాయేమో అని భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Shocking Facts About Vijayanagaram Train Accident Details Here Goes Viral , S-TeluguStop.com

విజయనగరం జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న రైలు ప్రమాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.సిగ్నలింగ్ వ్యవస్థ( Signaling system )లోని లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుతోంది.

కొన్ని నెలల క్రితం ఒడిశాలో జరిగిన బాలేశ్వర్ ప్రమాదంను తలపించే విధంగా ఈ ప్రమాదం ఉండటం గమనార్హం.వైఫల్యాల నుంచి రైల్వే శాఖ ఎలాంటి గుణపాఠాలను నేర్చుకోవడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సిగ్నలింగ్ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోందని అందుకే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు.

విశాఖ పలాస ప్యాసింజర్( Palasa Passenger ) సిగ్నల్ లేకపోవడంతో భీమాలి సమీపంలో నెమ్మదిగా వెళుతుండగా విశాఖ రాయగడ ప్యాసింజర్( isakhapatnam Rayagada Passenger ) వేగంగా వచ్చి ఈ రైలును ఢీ కొట్టింది.కంటకపల్లి దగ్గర ఆదివారం ఉదయం నుంచి సిగ్నలింగ్ సమస్య ఉందని తెలుస్తోంది.సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు ఉంటే రైళ్లు కేవలం 15 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాలి.

రాయగడ ప్యాసింజర్ మాత్రం వేగంగా వెళ్లి పలాస ప్యాసింజర్ ను ఢీ కొట్టింది.

సిగ్నలింగ్ సిబ్బంది ఆలసత్వం ప్రదర్శించకుండా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు.కంటకపల్లి ఆలమండ మధ్యలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.కొత్తవలస జంక్షన్ నుంచి కంటకపల్లి స్టేషన్ కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.

భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా రైల్వే శాఖ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.రైలు ప్రమాదంలో మరణించిన వాళ్ల సంఖ్య 13కు చేరింది.ప్యాసింజర్ రైళ్ల విషయంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube