శ్రీలీల కోసమే భగవంత్ కేసరి సెట్ కు మోక్షజ్ఞ వచ్చేవారా.. నిర్మాత షాకింగ్ క్లారిటీ ఇదే!

బాలయ్య భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) మూవీ మరో ఆరు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కగా సాహో గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.

 Shocking Facts About Sreeleela Mokshagna Relation Details Here Goes Viral In Soc-TeluguStop.com

ఈ సినిమా నిర్మాత సాహో గారపాటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.కొత్త నిర్మాతలను ప్రోత్సహించే విషయంలో నాని ముందువరసలో ఉంటారని ఆయన కామెంట్లు చేశారు.

నానితో రెండు సినిమాలు చేశామని ఆయన అన్నారు.ఒవర్సీస్ లో సినిమాలను సైతం డిస్ట్రిబ్యూట్ చేసిన సాహో గారపాటి( Sahu Garapat ) నిర్మాతగా తక్కువ సినిమాలే చేసినా మంచి స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ ముందడుగులు వేస్తున్నారు.

వివాదాలకు దూరంగా ఉండే ఈ ప్రముఖ నిర్మాత భగవంత్ కేసరి మూవీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అఖండ సమయంలో బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేసి ఈ సినిమా చేశామని ఆయన తెలిపారు.

Telugu Akhanda, Mokshagna, Nani, Sahu Garapat, Sreeleela-Movie

బాలయ్యకు ఉండే క్రమశిక్షణలో పది శాతం ఉన్నా మనం గొప్ప స్థాయికి ఎదగవచ్చని సాహో గారపాటి కామెంట్లు చేశారు.ఈ సినిమాతో సొసైటీకి మెసేజ్ కూడా ఇస్తామని ఆయన అన్నారు.బాలయ్య గారి యాక్షన్ మిస్ కాకుండా ఈ సినిమా చేశామని ఆయన తెలిపారు.బాలయ్య సినిమాకు ఓపెనింగ్స్ అద్భుతంగా ఉంటాయని ట్రైలర్ లో చాలా విషయాలను రివీల్ చేయలేదని సాహో గారపాటి అన్నారు.

Telugu Akhanda, Mokshagna, Nani, Sahu Garapat, Sreeleela-Movie

మోక్షజ్ఞ( Mokshagna ) త్వరలో హీరో అవుతుండటంతో భగవంత్ కేసరి సెట్స్ కు కొంచెం ఎక్కువగా వస్తున్నారే తప్ప అంతకు మించి మరే కారణం లేదని ఆయన తెలిపారు.శ్రీలీల కోసమే భగవంత్ కేసరి సెట్ కు మోక్షజ్ఞ వచ్చేవారని జరుగుతున్న ప్రచారానికి సాహో గారపాటి చెక్ పెట్టారు.భగవంత్ కేసరి బాలయ్య కెరీర్ లో బెస్ట్ మూవీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మోక్షజ్ఞను నెక్స్ట్ ఇయర్ లాంఛ్ చేస్తారని సాహో గారపాటి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube