యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) ఒకరు.విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
విజయ్ ఖుషి సినిమా వరకు ఒక్క హిట్ కోసం ఎంతో తపించిపోయాడు.ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్ కూడా నిరాశ పరిచింది.
ఇక ఎట్టకేలకు ఈ యంగ్ హీరో ఖుషి సినిమాతో గత నెల ఆడియెన్స్ ముందుకు వచ్చి హిట్ కొట్టాడు.

ప్రస్తుతం విజయ్ ఖుషీ( Khushi )తో వచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరిన్ని సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.ప్రజెంట్ విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.వాటిల్లో ఈయన కెరీర్ లో తెరకెక్కుతున్న 13వ సినిమా ఒకటి.
ఈ సినిమాను విజయ్ కు గీతా గోవిందం( Geeta Govindam ) వంటి ఘన విజయం అందించిన పరశురామ్ తో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ఇటీవలే షూట్ కూడా స్టార్ట్ చేసారు.
‘VD13’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.ఇప్పటికే 50 శాతం పైగానే షూట్ పూర్తి అయినట్టు టాక్.
ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ తో పాటు మిగిలిన ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక వార్త వైరల్ అయ్యింది.
ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అతి త్వరలోనే రాబోతుందట.

ఈ సినిమా టీజర్ ను ముందుగా అక్టోబర్ 16న రిలీజ్ చేయాలని అనుకున్నారట.కానీ ఇప్పుడు కొద్దిగా పోస్ట్ పోన్ చేసి 18 లేదా 19న రిలీజ్ చేయనున్నట్టు టాక్ వైరల్ అవుతుంది.త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందట.
కాగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించి దిల్ రాజు సంక్రాంతి బరిలో ఈసారి కూడా తన మూవీ ఉండేలా చూసుకున్నారు.