అనంతపురానికి చెందిన మహిళ సాకే భారతి ( Sake Bharti )ఒకవైపు కూలి పనులు చేస్తూనే మరోవైపు పీహెచ్డీ సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.ఆమె ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.
సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ( Senior Journalist Damu Balaji ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాకే భారతి గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం .
మీడియా వల్ల సాకే భారతి వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన వెల్లడించారు.తన కష్టానికి తగిన గుర్తింపు రావడంతో సాకే భారతి సంతోషిస్తున్నారని ఏడేళ్లు కష్టపడి ఆమె పీహెచ్డీ చేసిందని దాము బాలజీ అన్నారు.సాకే భారతిలో రూరల్ ఇన్నోసెన్స్ ఇప్పటికీ ఉందని ఆయన కామెంట్లు చేశారు.
సాకే భారతి మేనమామను వివాహం చేసుకుందని దాము బాలాజీ పేర్కొన్నారు.

రాళ్లు కొట్టడం, మూటలు మోయడం లాంటి పనులను సాకే భారతి భర్త చేశారని దాము బాలాజీ చెప్పుకొచ్చారు.తనకు ఒకే కిడ్నీ ( Kidney )ఉందని సాకే భారతి తాజాగా చెప్పారని దాము బాలాజీ అన్నారు.డాక్టర్లు పరీక్షలు చేయగా పుట్టుకతోనే భారతికి ఒకే కిడ్నీ ఉందని తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఒకే కిడ్నీ ఉండటం వల్ల ఆమె ఆరోగ్యం విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని దాము బాలాజీ వెల్లడించారు.

తాతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఆమె కష్టపడి చదివిందని దాము బాలాజీ అన్నారు.ఎంతోమంది ఆమెకు సన్మానం చేయడంతో పాటు ఆర్థికంగా తమ వంతు సహాయం చేశారని ఆయన కామెంట్లు చేశారు.ప్రభుత్వం నుంచి మాత్రం మరీ భారీ స్థాయిలో సాకే భారతికి సహాయం అందలేదని ఆయన కామెంట్లు చేశారు.
సాకే భారతికి కెరీర్ పరంగా అనుకూలంగా జరగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







