ఆనంద్ దేవరకొండ. వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) హీరో హీరోయిన్ గా రూపొంది గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బేబీ’ సినిమా ఏ రేంజ్ లో దూసుకు పోతుందో మనం చూస్తూనే ఉన్నాం.ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా రూ.75 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడుతున్నాయి.వర్షాలు పడుతున్నా కూడా బేబీ కలెక్షన్స్ వర్షం ఆగలేదు.
సాధారణంగా అయితే ఇతర సినిమా లకు మినిమం వసూళ్లు కూడా నమోదు అయ్యేవి కాదు.కానీ బేబీ సినిమా( Baby movie ) కు వర్షాలు ఉన్నా కూడా వసూళ్లు బాగానే నమోదు అయ్యాయి.అవుతున్నాయి.ఇప్పటి వరకు బేబీ సినిమా సాధించిన వసూళ్లను కాస్త పరిశీలనగా చూస్తే వర్షాలు లేకుండా ఉంటే కచ్చితంగా ఈ సినిమా వంద కోట్ల కు పైగా వసూళ్లు నమోదు చేసి ఉండేది.
ఈ మొత్తం కలెక్షన్స్ కూడా వర్షాల్లోనే నమోదు అయ్యాయి.ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది వర్షాల కారణంగా బేబీ సినిమా ను చూడలేక పోతున్నాం.
ఎప్పుడు వర్షం తగ్గితే అప్పుడు సినిమా ను చూస్తామని అంటున్నారు.అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు.ఒక వేళ వర్షాలు లేకుండా ఉంటే బేబీ సినిమా వంద కోట్ల మైలు రాయి ఇప్పటికే చేరి ఉండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో బేబీ వసూళ్లకు బ్రేక్ పడటం లేదు.
మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ బ్రో సినిమా రాబోతుంది.ఆ సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమా యొక్క వసూళ్లు తగ్గే అవకాశం ఉంది.
ఒక వేళ బ్రో సినిమా ప్రేక్షకులు ఆధరించకుంటే మాత్రం కచ్చితంగా మళ్లీ బేబీ సినిమా వసూళ్లు పుంజుకునే అవకాశం ఉంది.అప్పుడు వంద కోట్లు నమోదు కావచ్చు.