ఆ సినిమాకు సాయిపల్లవిని హీరోయిన్ గా వద్దనుకున్న శేఖర్ కమ్ముల.. ఏమైందంటే?

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి శేఖర్ కమ్ముల కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.

నేను స్టోరీ కరెక్ట్ గా చెప్పాలని భావిస్తానని ఆయన పేర్కొన్నారు.

సెట్లు వేసి షూట్ చేయడం నాకు ఇష్టం ఉండదని ఆయన వెల్లడించారు.పాత్రల పేర్లను రాసుకునే సమయంలో ఆలోచించి రాసుకుంటానని ఆయన పేర్కొన్నారు.

సినిమాల్లో పాత్రలనే చూడాలని నేను భావిస్తానని ఆయన అన్నారు.హీరో హీరోయిన్లను బట్టి నేను కథలు మార్చనని శేఖర్ కమ్ముల వెల్లడించారు.

కథ బౌండ్ స్క్రిప్ట్ ముందే సిద్ధం చేస్తానని శేఖర్ కమ్ముల కామెంట్లు చేశారు.లవ్ స్టోరీ సినిమాకు మొదట సాయిపల్లవిని అనుకోలేదని వేరే హీరోయిన్ ను ఎంపిక చేసి ఆ హీరోయిన్ వర్కౌట్ కాకపోవడంతో సాయిపల్లవిని ఫైనల్ చేశామని శేఖర్ కమ్ముల అన్నారు.

Advertisement

లవ్ స్టోరీ క్లైమాక్స్ ను బ్యాలెన్స్ చేయడం కష్టమని ఆయన కామెంట్లు చేశారు.ఎన్నో క్లైమాక్స్ లను పరిశీలించి ఈ క్లైమాక్స్ ను తెరకెక్కించానని శేఖర్ కమ్ముల అన్నారు.

కెరీర్ తొలినాళ్లలో నా సినిమాలను నేను నిర్మించుకున్నానని ఆయన కామెంట్లు చేశారు.అప్పట్లోనే క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమాలు చేశానని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

నా సినిమాలకు అవార్డులు బాగా వచ్చాయని శేఖర్ కమ్ముల తెలిపారు.అవార్డులు ఏ సినిమాకు వస్తాయో చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.

లవ్ స్టోరీ సినిమాలో ఆ పాత్రలో నటించడానికి రాజీవ్ కనకాల ఎంతో ఇబ్బంది పడ్డారని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.లవ్ స్టోరీ సినిమా ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిందని ఆయన వెల్లడించారు.శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు