ఇందిరా దేవి మహేష్ ను అలా పిలిచేవారట.. తల్లిపై మహేష్ కు ఎంత ప్రేమంటే?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణ వార్త అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఇందిరా దేవి తన నివాసంలో మృతి చెందారు.

 Shocking Facts About Mahesh Babu Mother Indira Devi Details Here , Mahesh Babu-TeluguStop.com

ఇందిరా దేవి మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తుండటం గమనార్హం.తల్లి మరణ వార్త తెలిసి మహేష్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు.

మహేష్ బాబును తల్లి ఇందిరా దేవి నాని అని పిలిచేవారని సమాచారం.గతంలో ఏ ఇంటర్వ్యూలో అయినా తల్లి ప్రస్తావన రాగానే మహేష్ బాబు ఎమోషనల్ అయ్యేవారు.

ఇందిరా దేవి కృష్ణకు మొదటి భార్య కాగా ఆమె మామ కూతురు కావడం గమనార్హం.కృష్ణ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ సూచనల మేరకు ఇందిరా దేవిని పెళ్లి చేసుకోవడం జరిగింది.

కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఇందిరా దేవి అరుదుగా మాత్రమే బయటకు వచ్చేవారు.

ఏప్రిల్ 20వ తేదీన ఇందిరా దేవి పుట్టినరోజు కాగా ఆరోజు మహేష్ సోషల్ మీడియా వేదికగా అమ్మా మీరు నా తల్లి కావడం అదృష్టమని మీ గురించి చెప్పడానికి ఒక్కరోజు సరిపోదని పేర్కొన్నారు.

ఎప్పటికీ నిన్ను లవ్ చేస్తూనే ఉంటానని మహేష్ ఆ ట్వీట్ లో చెప్పుకొచ్చారు.తన ట్వీట్ ద్వారా మహేష్ బాబు తల్లిపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.

ఈ ఏడాది జనవరిలోనే రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Telugu Indira Devi, Mahesh Mother, Ramesh Babu, Tollywood-Movie

రమేష్ బాబు మరణాన్ని మరవక ముందే ఇందిరా దేవి మరణించడం అభిమానులను మరింత బాధ పెడుతోంది.దుఃఖంలో ఉన్న మహేష్ ఫ్యామిలీకి దేవుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.ఇందిరా దేవి మరణంతో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube