మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది.చంద్రబాబు అరెస్ట్ విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబుపై కేసు ప్రూవ్ అయితే మాత్రం ఏకంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.చంద్రబాబు ఈ కేసు నుంచి బయటపడటం కూడా సులువు కాదని సమాచారం అందుతోంది.
గతంలో పలు కేసులపై స్టే తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ఈ కేసు విషయంలో స్టే తెచ్చుకునే అవకాశాలు కూడా లేవు.ఐటీ కేసులో చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పదవులు చేపట్టకుండా చంద్రబాబుపై అనర్హత వేటు పడే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.
గతంలో మాదిరి తప్పించుకునే అవకాశం లేదని ఐటీ నోటీసులో ఉన్నవి తీవ్ర ఆరోపణలు అని సమాచారం.

డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో పాటు సాక్షుల వాంగ్మూలం పక్కాగా ఉండటంతో ఈ కేసు వల్ల చంద్రబాబుకు సమస్యలు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పన్ను ఎగవేతతో పాటు కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ( CBI ) దర్యాప్తుకు కూడా అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలితపై( Jayalalithaa ) ఇదే తరహా కేసులు నమోదు కావడం జరిగింది.ఈ కేసు వల్ల మరిన్ని స్కామ్స్ కూడా వెలుగులోకి వఛే చాన్స్ అయితే ఉంది.చంద్రబాబు అరెస్ట్ గురించి వైసీపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.కర్మ అనుభవించక తప్పదని అంబటి కామెంట్ చేయగా స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందని బలమైన ఆధారాలు ఉన్నాయని సజ్జల చెబుతున్నారు.
ఈ కేసు వల్ల చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







