టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.బాలయ్య ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఆ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.
బాలయ్య తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించి ఆ సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.అయితే బాలయ్య సినీ కెరీర్ లో కొన్ని సినిమాలు వేర్వేరు కారణాల వల్ల ఆగిపోయాయి.
బాలయ్య సినీ కెరీర్ లో ఆగిపోయిన సినిమాలలో విక్రమ సింహ భూపతి ఒకటి కాగా ఈ సినిమా విడుదలై ఉంటే బాలయ్య కెరీర్ లో బాహుబలి అయ్యేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు కాగా ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైంది.
ఎస్.గోపాల్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా వేర్వేరు కారణాల వల్ల ఆగిపోయింది.
బాహుబలి తరహా కథాంశంతో అప్పట్లో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది.
బాలయ్య ఈ సినిమాలో రెండు పాత్రలలో నటించగా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తికాక రిలీజ్ ఆగిపోవడం అభిమానులను ఎంతగానో బాధపెట్టింది.
పూజా భాత్రా, అంజలా ఝవేరి, రోజా ఈ సినిమాలో నటించారు.

భారీ సెట్టింగ్ లలో షూటింగ్ ను జరుపుకున్న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనే ప్రయత్నాలు జరిగాయని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే వైరల్ అయిన వార్తలలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.బాలయ్యకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బాలయ్య విజయాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







