ఈ ప్రముఖ నటుడు సొంత తమ్ముడినే చంపాలకున్నాడా.. అలా చెప్పాడంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, విలన్ గా, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ ద్వారా ఆనంద్ రాజ్( Anand Raj ) ఒకరు.ఆనంద్ రాజ్ సోదరుడు అనిల్ రాజు( Anil Raju ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

 Shocking Facts About Anand Raj Brother Anil Raju Details, Anand Raj, Anil Raju,-TeluguStop.com

మా అన్న పేరు ఆనంద్ రాజ్ గజ అని ఆయనను అందరూ గజ అని పిలుస్తారని అనిల్ రాజు చెప్పుకొచ్చారు.ఆనంద్ రాజుకు సింధూర పువ్వు తొలి సినిమా అని ఆ తర్వాత ఆయన కొన్ని సినిమాలలో హీరోగా చేసి డబ్బులు పోగొట్టుకున్నాడని అనిల్ రాజు చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఆనంద్ రాజు విలన్ గా కెరీర్ ను కొనసాగించారని అనిల్ రాజు కామెంట్లు చేశారు.మా అన్నయ్య మొదట పోలీస్ గా పని చేశారని మా అన్నయ్య సినిమాల్లోనే కాదని రియల్ లైఫ్ లో కూడా విలన్ అని అనిల్ రాజు కామెంట్లు చేశారు.16 సంవత్సరాల వయస్సులో నేను హిజ్రా అని తెలిసిందని కుటుంబానికి పెద్ద ఆనంద్ రాజ్ అని అనిల్ రాజు వెల్లడించారు.నేను లిప్ స్టిక్, ఐ బ్రోస్ వేసుకున్నానని అనిల్ రాజు కామెంట్లు చేశారు.

మాది ఆళ్లగడ్డ దగ్గర ఉన్న చాగలమర్రి అని ఆయన చెప్పుకొచ్చారు.నా హావభావాలు బయటపడటంతో మా ఆన్నయ్య విషం ఇచ్చి చంపేద్దామని అమ్మతో చెబుతుంటే విన్నానని అనిల్ రాజు చెప్పుకొచ్చారు.పాలలో విషం ఇచ్చి చంపాలని ఆన్నయ్య అనుకున్నాడని ఆయన తెలిపారు.ముంబైకు వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాలని అనుకుంటే మా అన్నయ్య డాక్టర్ కు ఫోన్ చేసి బెదిరించాడని అనిల్ రాజు అన్నారు.

నేను ఏడో తరగతి వరకు చదివానని నాకు చదువు పెద్దగా రాదని ఆయన తెలిపారు.నేను శివశంకర్ మాస్టర్( Shivashankar Maste ) దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నానని అనిల్ రాజు పేర్కొన్నారు.ఏడో తరగతిలో చీర, లంగా కట్టుకుని డ్యాన్స్ చేయడంతో అన్నయ్య కొట్టాడని ఆయన తెలిపారు.నా హావభావాల వల్ల చదువు మానేశాననని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube