దేవదాస్ సినిమాలో ఏఎన్నార్ మళ్లీ తాగి నటించారా.. అసలేం జరిగిందంటే?

అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా ఆయన నటించిన సినిమాలలో దేవదాస్( Devdas ) మూవీ ప్రత్యేకమైనదనే సంగతి తెలిసిందే.నాగేశ్వరరావు, సావిత్రి ఈ సినిమాలోని పాత్రలకు ప్రాణం పోశారు.

 Shocking Facts About Akkineni Devadas Movie Details Here Goes Viral , Akkineni N-TeluguStop.com

ఈ సినిమా విడుదలై దశాబ్దాలు దాటినా దేవదాస్ అనే పేరు వింటే ఏఎన్నార్ కళ్ల ముందు మెదులుతారు.శరత్ చంద్ర( Sarath Chandra ) ఛటోపాధ్యాయ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా ఇతర భాషల్లో రీమేక్ అయినా ఆ భాషల్లో నటించిన నటీనటులు అక్కినేని స్థాయిలో తాము నటించలేదని చెప్పారంటే ఈ పాత్రకు ఏఎన్నార్ ఏ స్థాయిలో న్యాయం చేశారో అర్థమవుతుంది.మొదట దేవదాస్ పాత్రకు అక్కినేని పేరును పరిశీలించిన సమయంలో ఆయనను తీసెయ్యాలని చాలామంది సూచించినా మేకర్స్ మాత్రం అందుకు అంగీకరించలేదు.

Telugu Akkineni, Devadas, Devdas, Sarath Chandra, Tollywood-Movie

భగ్న ప్రేమికుల పాత్రలకు ఏఎన్నార్ సావిత్రి ప్రాణం పోశారనే చెప్పాలి.అయితే ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో అక్కినేని నిజంగానే తాగి నటించారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.ఈ సినిమాలోని జగమే మాయ బ్రతుకే మాయ సాంగ్ షూట్ రాత్రి సమయంలో జరిగింది.ఏఎన్నార్ రాత్రివేళలో కడుపునిండా తిని సాంగ్ షూట్ లో పాల్గొనేవారట.

Telugu Akkineni, Devadas, Devdas, Sarath Chandra, Tollywood-Movie

నిద్రకు కళ్లు మూతలు పడుతుండగా అలాంటి సమయంలో ఈ సాంగ్ ను షూట్ చేయడంతో అక్కినేని నిజంగా తాగినట్టు ఎక్స్ ప్రెషన్లు ఇవ్వగలిగారు.దేవదాస్ సినిమాలో భవిష్యత్తులో మళ్లి ఎవరైనా తెరకెక్కించినా అక్కినేని స్థాయిలో మెప్పించడం, ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడం మాత్రం సులువైన విషయం కాదు.ఈతరం ప్రేక్షకుల్లో కూడా ఎంతోమంది దేవదాస్ సినిమాకు అభిమానులుగా ఉన్నారు.

మరోవైపు అక్కినేని హీరోలకు ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగలడంతో కథల ఎంపికలో ఈ హీరోలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube