సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో ఎక్కువగా మగవారి ఆధిపతమే నడుస్తుంది అని అనుకుంటారు.కానీ కాస్త వెనక్కి వెళితే ఒక లేడీ డామినేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది.
పైగా తన ఆధిపత్యంతో ఎన్నోసార్లు గొడవల్లో ఇరుక్కుని వివాదాల పాలైన ఆ నటి గురించి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి.ఇంతకీ ఆ నటీమణి ఎవరు అనుకుంటున్నారా ? మరెవరో కాదు తొలి తరం నటి జి.వరలక్ష్మి( Actress G Varalakshmi ). ఈమె జీవితమంతా వివాదాలే.అన్ని అనవసరమైన విషయాల్లో తలదూర్చి గొడవలు పెట్టుకోవడం బాగా అలవాటు.ఎన్నో సార్లు ఆమె తనతో పాటు నటించే నటులతో దర్శక నిర్మాతలతో గొడవ పడుతూ దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేది.
కొన్నిసార్లు కొంతమంది ఆర్టిస్టులపై చేయి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.అందులో కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
జి.వరలక్ష్మికి తొందర పాటు ఎక్కువే అయితే ఆత్మవిశ్వాసం కూడా నిండు గానే ఉండేది.ఆమె పోషించే పాత్రలో కూడా ఆ దురుసుతనం, అహంకారం, ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా కనిపించేవి.అలాంటి పాత్రలే చేసేవారు కూడా.అందుకే ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character Artist ) గానే కొనసాగింది.ఎవరిని పెద్దగా లెక్క చేసేది కాదు.
ఆమె తొందర పాటు నిర్ణయం ఎలా ఉంటాయంటే ఏకంగా ఇండస్ట్రీలోనే ఎంతో సెటిల్ అయినా దర్శకుడు కె.ఎస్.ప్రకాష్ రావు( Director KS Prakash Rao )ను ద్వితీయ వివాహం చేసుకొని ఆ తర్వాత పిల్లలు పుట్టాక అతడిని వదిలేసి అజిత్ సింగ్ అనే ఒక పహిల్వాన్ తో లేచిపోయింది.ఆమె ప్రకాష్ రావు తో వరలక్ష్మికి పుట్టిన సంతానానికి కూడా ప్రకాష్ అనే పేరు పెట్టుకోండి.
ప్రకాష్ రావు భార్యగా బాగా ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించేది.ఒకసారి ద్రోహి చిత్రం( Drohi Movie ) షూటింగ్ జరుగుతున్న సందర్భంలో ఆమె సదరు కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ భార్యగా ఉంది కాబట్టి తన ఆధిపత్యాన్ని ఆ సినిమాలో నటిస్తున్న లక్ష్మి రాజ్యంపై చూపించింది.ఎంతలా అంటే ఓసారి లక్ష్మీరాజ్యాన్ని చెప్పుతో దారుణంగా కొట్టిందట.దాంతో పోలీస్ స్టేషన్ వరకు కేసు వెళ్లిందట.పెద్దలంతా ఈ విషయాన్ని సర్దుమని ఎలా చేశారు.మరోమారు సావిత్రి తండ్రి వెంకట్ రామ చౌదరి పై కూడా గొడవ బాగా జరిగింది.
జ్యోతి సినిమా షూటింగ్ టైంలో వరలక్ష్మి సావిత్రి ఇద్దరు నటించారు.ఈ చిత్రంలో అనుకోకుండా చిన్న విషయం లో గొడవ జరిగితే దాని గురించి సావిత్రి పై కక్ష పెట్టుకుని ఆమెపై చెప్పు చూపించిందట.
అలాగే ఆమె కొనుక్కున్న కొత్త కార్లు టైర్లు కూడా కోయించిందట.అలా వివాదాల్లో ఇరుక్కోవడం వరలక్ష్మికి బాగా అలవాటు.