సర్వేల షాక్.. కన్ఫ్యూజన్ లో జగన్ !

ఎన్నికలు దగ్గర పడే కొద్ది సర్వేల హడావిడి రోజు రోజుకు పెరుగుతోంది.సర్వేల ఆధారంగానే గెలుపు విషయంలో ఓ అంచనాకు వస్తుంటారు రాజకీయ నాయకులు.

 Shock Of Surveys Jagan In Confusion, Surveys , Ys Jagan Mohan Reddy, Tdp, Jana-TeluguStop.com

కొన్ని జాతీయ సంస్థల నుంచి వచ్చే సర్వేలే కాకుండా సొంత సర్వేలు కూడా చేయించుకుంటూ ప్రజల్లో గ్రాఫ్ ఎలా ఉందనే దానిపై ఓ అంచనాకు వస్తుంటారు పార్టీల అధినేతలు.కాగా ఈసారి ఏపీలో ఆసక్తికరమైన పోరు నెలకొనడంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఎలాంటి సర్వే బయటకు వచ్చిన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.

Telugu Ap, Chandra Babu, Jana Sena, Janasena, Lokesh, Pawan Klayan, Ysjagan-Poli

తాజాగా టైమ్స్ నౌ సంస్థ లోక్ సభ ఎన్నికల దృష్ట్యా నిర్వహించిన సర్వేలో వైసీపీ 25 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తుందని రిపోర్ట్ ఇచ్చింది.ఈ సర్వే ఇచ్చిన రిపోర్ట్ తో వైసీపీ నేతలు ఆనందంలో మునిగితేలారు.కానీ ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆత్మ సాక్షి విడుదల చేసిన సర్వే ఫలితాలు వైసీపీ( YCP )ని ఉలిక్కి పడేలా చేశాయి.ఏపీలో టీడీపీ జనసేన( TDP ) మిత్ర పక్షం 102 స్థానాలకు పైగా కైవసం చేసుకునే అవకాశం ఉందని అందులో టీడీపీ 95 స్థానాలను గెలుచుకుంటే జనసేన 7 సీట్లను సాధిస్తుందని, వైసీపీ 60 సీట్లకే పరిమితం అవుతుందని ఆత్మ సాక్షి సర్వే వెల్లడించింది.

Telugu Ap, Chandra Babu, Jana Sena, Janasena, Lokesh, Pawan Klayan, Ysjagan-Poli

దీంతో ఏ సర్వే లు ఇస్తున్న రిపోర్ట్ తో కన్ఫ్యూజన్ పడుతున్నారట రాజకీయ నాయకులు.ఏ సర్వేను నమ్మాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారట.దీంతో జాతియ సంస్థలు నిర్వహించే సర్వేలను పక్కన పెట్టి సొంతంగా సర్వే నిర్వహించుకొని ముందుకు సాగాలని వైసీపీ భావిస్తుందట.ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న వైసీపీ ఆ స్థాయి విజయం లభిస్తుందా లేదా అనే దానిపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలను ప్రజల్లో ఉంచినట్లు టాక్.

సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే జగన్ తేల్చి చెప్పారు కూడా.అందుకే జాతీయ సర్వేలను నమ్మకుండా సొంత సర్వే సంస్థలపైనే జగన్( YS Jagan Mohan Reddy ) ఫుల్ ఫోకస్ పెట్టరాట వినికిడి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube