బస్సుల్లో, ట్రైన్‌లలో ప్రయాణించినప్పుడు ఒక్కోసారి సీట్లు దొరకవు.కూర్చుందామన్నా కొన్ని సీట్లు పాడై పోయి కనిపిస్తాయి.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణిస్తుంటారు.అయితే విమానాల్లో ఎవరైనా ఇలా నిలబడి ప్రయాణించడం సాధ్యం కాదు.
కానీ ఓ ఇండిగో విమాన ప్రయాణికురాలికి మాత్రం వింత అనుభవం ఎదురైంది.కూర్చుందామని తన సీట్ వద్దకు వెళ్లి షాక్‌కు గురైంది.

సీటులో కుషన్ కనిపించలేదు.దీంతో ఎలా కూర్చోవాలో తెలియక ఆమె అయోమయానికి గురైంది.పూణె నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న ఇండిగో 6ఈ-6798 విమానంలో( Indigo flight 6E-6798 ) తాజాగా ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.పుణె నుండి నాగ్‌పూర్‌కి ఏదో పని నిమిత్తం వెళుతున్న సాగరిక పట్నాయక్ అనే ప్రయాణికురాలు తన సీటులో సగం కుషన్ కనిపించకుండా పోయిందని గమనించింది.దీనిపై సాగరిక భర్త సుబ్రతా పట్నాయక్ ( Subrata Patnaik )మీడియాతో మాట్లాడారు.‘ఇండిగో విమానయాన సంస్థ తన భార్యకు విండో సీటు 10ఏ కేటాయించింది.కానీ ఆమె తన సీటుకు చేరుకున్న వెంటనే, సీటు పరిస్థితిని చూసి ఆమె అవాక్కైంది.సీటుపై ఉన్న కుషన్లు లేకపోవడం గమనించింది.నా భార్య అక్కడ ఉన్న క్యాబిన్ సిబ్బందితో దాని గురించి మాట్లాడింది.అయితే వారు ఆమెను సీటు కింద చూడమని బదులిచ్చారు.

చివరికి ఓ క్రూ మెంబర్ మరో సీటు నుంచి కుషన్ తెచ్చి సాగరికకు ఇచ్చాడు.’ అని పేర్కొన్నాడు.ఇలా సీటు కుషన్ ఎలా మాయమవుతుందని సాగరిక భర్త సుబ్రతా పట్నాయక్ ప్రశ్నించారు.ఇండిగో వంటి ఎయిర్‌లైన్ సంస్థలో ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని చెప్పాడు.అయితే దీనిపై విమానయాన సంస్థలు క్లారిటీ ఇచ్చాయి.శుభ్రం చేయడానికి కుషన్ తీసుకున్నట్లు చెప్పాడు.
సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయ్యాక నెటిజన్లు ఇండిగో విమానయాన సంస్థపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.ప్రయాణికులకు ఇలాంటి అనుభవాలు ఎదురవకుండా చూడాలని సూచిస్తున్నారు.