AP: ఏపీ ప్రజలకు షాక్: హెడ్ సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే జరిమానా.. ఎంతంటే..?

ఏపీ (AP) సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇకనుంచి వాహనదారులు హెడ్ సెట్( Headset ) పెట్టుకొని వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామని తెలియజేసింది.

దీనికి సంబంధించి రవాణా శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది.మరి ఆ వివరాలు ఏంటో చూసేద్దాం.

రాష్ట్రంలో ప్రతిరోజు ఎన్నో ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి.ఇందులో ఎక్కువ శాతం ఘటనలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే కొంతమంది నిర్లక్ష్యంగా చెవిలో హెడ్ సెట్ పెట్టుకొని వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదానికి కారణం అవుతున్నారు.దీనివల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఆ ప్రమాదాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP GOVT) ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఇకనుంచి డ్రైవింగ్(Driving) చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్ పెట్టుకొని పట్టుపడితే మాత్రం రూ:20వేల జరిమానా ఉంటుందని తెలియజేసింది.ఈ నిర్ణయానికి సంబంధించి రూల్స్ ఆగస్టు నెల నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది.ఈ రూల్స్ కు(Rules) సంబంధించి మొత్తం వివరాలను రవాణా శాఖకు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొంతమంది ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే,మరో కొంత మంది ప్రజలు ప్రభుత్వంపై(Government) మండిపడుతున్నారు.మరి చూడాలి ఈ రూల్స్ అమలయ్యాక ఏ విధమైనటువంటి స్పందన లభిస్తుందో ముందు ముందు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు