పునీత్ రాజ్ కుమార్( Puneeth Rajkumar ) మరణించి చాలా రోజులై నా అభిమానులు మాత్రం ఆయన మరణాన్ని మరిచిపోవడం లేదు.శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ మూవీ( Ghost Movie ) మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శివరాజ్ కుమార్ పునీత్ ను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
పునీత్ రాజ్ కుమార్ మరణం నేను ఇప్పటికీ ఒప్పుకోలేని విషయం అని ఆయన చెప్పుకొచ్చారు.పునీత్ రాజ్ కుమార్ నా కంటే వయస్సులో 13 సంవత్సరాలు చిన్నవాడు అని శివరాజ్ కుమార్ వెల్లడించారు.
నేను నా భావాలను వ్యక్తపరచలేనని నేనెప్పుడూ పునీత్ సమాధి దగ్గరకు వెళ్లనని శివరాజ్ కుమార్ తెలిపారు.
ఎందుకంటే అక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించరని తాను అలాంటివి నమ్మనని శివరాజ్ కుమార్( Shivaraj Kumar ) వెల్లడించారు.పునీత్ చనిపోయానని తాను అంగీకరిస్తే మాత్రమే ఇలాంటివి ఆలోచిస్తానని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.పునీత్ రాజ్ కుమార్ చనిపోయాడని నా మనస్సు ఇప్పటికీ అంగీకరించడం లేదని ఆయన కామెంట్లు చేశారు.
ఘోస్ట్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.థియేటర్ల కొరత వల్ల కొన్ని రాష్ట్రాలలో ఈ సినిమా రిలీజ్ కావడం లేదు.
శివరాజ్ కుమార్ ఈ మధ్య కాలంలో గెస్ట్ రోల్స్( Guest Roles ) లో నటించిన సినిమాలు సైతం సక్సెస్ సాధిస్తున్నాయి.శివరాజ్ కుమార్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.
శివరాజ్ కుమార్ ప్రస్తుతం పరిమితంగానే రెమ్యునరేషన్( Shivaraj Kumar Remuneration )) ను తీసుకుంటున్నారని తెలుస్తోంది.దసరాకు రిలీజ్ కానున్న అన్ని సినిమాలు సక్సెస్ సాధించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.శివరాజ్ కుమార్ ఈ సినిమతో కెరీ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటారేమో చూడాలి.అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.ఐదు భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతూ ఉండటం గమనార్హం.