శివకార్తికేయన్, అనుదీప్ కె.వి 'ప్రిన్స్' ఫస్ట్ సింగల్ సెప్టెంబర్ 1న విడుదల

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘ప్రిన్స్’. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది.

 Shivakarthikeyan Director Anudeep Prince Movie First Single On September 1st, Si-TeluguStop.com

ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్‌లను సెప్టెంబర్1 నుండి ప్రారంభించనున్నట్లు ప్రకటించిన నిర్మాతలు అదే రోజు ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో లీడ్ పెయిర్ వండర్ ఫుల్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు.

ఇద్దరూ పసుపు రంగు దుస్తుల్లో వైబ్రెంట్ గా కనిపించారు.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.అరుణ్ విశ్వ సహ నిర్మాత.

తారాగణం:

శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.

సాంకేతిక విభాగం

రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి, సంగీతం: ఎస్ థమన్, నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు, బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్, సమర్పణ: సోనాలి నారంగ్, సంగీతం: ఎస్ థమన్, డీవోపీ: మనోజ్ పరమహంస, సహ నిర్మాత: అరుణ్ విశ్వ, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, ఆర్ట్ : నారాయణ రెడ్డి, పీఆర్వో : వంశీ-శేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube