Shiva Jyothi : ఓటు వేయడానికి ఆ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చిన శివ జ్యోతి… మరో బీఎండబ్ల్యూ కార్ పక్కా అంటూ కామెంట్స్?

శివ జ్యోతి( Shiva Jyothi ) పరిచయం అవసరం లేని పేరు తీన్మార్ వార్తలు ద్వారా తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి శివ జ్యోతి అనంతరం బిగ్ బాస్ ( Bigg Boss ) అవకాశాన్ని అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ ద్వారా ఈమె ఎంతో ఫేమస్ అవ్వడమే కాకుండా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Shivajyothi And Her Husband Latest Photos Viral-TeluguStop.com

ఇక బిగ్ బాస్ తర్వాత ఈమె యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో బిజీగా ఉంటూ భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారని చెప్పాలి.ఇలా ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు యూట్యూబ్ వీడియోలు చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి ఈమె తెలంగాణ ఎన్నికలలో పూర్తిగా భాగమయ్యారని తెలుస్తుంది.ముఖ్యంగా కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎన్నో వీడియోలను చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఒకప్పుడు ఎట్లుంటే మన తెలంగాణ ఇప్పుడు ఎలా మారిపోయింది అంటూ పెద్ద ఎత్తున ఈమె బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.తాజాగా తెలంగాణలో ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈమె బీఆర్ఎస్ పార్టీ జెండా రంగు అయినటువంటి పింక్ కలర్( Pink Colour ) డ్రెస్ వేసుకొని ఓటు వేయడానికి వెళ్లారు.

ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి ఈమె ఓటు వేసినట్టు సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోలను షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది ఈమె పట్ల పూర్తిస్థాయిలో నెగిటివ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోయారు.మీరు పింక్ రంగు దుస్తులు వేసుకొని ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేస్తున్నారు కానీ నిరుద్యోగుల గురించి ఒక్కసారి ఆలోచించి ఇలాంటి పనులు చేస్తే బాగుండేది అంటూ కొందరు కామెంట్లు చేయడం మరికొందరు పక్కా ఫిక్స్ మరో బిఎండబ్ల్యూ కార్ మీకు రావడం కన్ఫర్మ్ అంటూ కూడా ఈమెపై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి మాత్రం కెసిఆర్ గెలవరు వాళ్ళు ఇంటికి పోవడం పక్క అంటూ ఈమె షేర్ చేసిన ఈ ఫోటో పై భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

మీరు కేవలం ప్రమోషన్లలో భారీ స్థాయిలో డబ్బు తీసుకొని మీ గురించి మాత్రమే ఆలోచించారే తప్ప రాష్ట్రంలో నిరుద్యోగ యువతులు( Unemployed ) పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఆలోచించలేదని వారి గురించి ఒకసారి ఆలోచించి ఉంటే ఇలాంటి పనిచేసే ఉండేవారు కాదు అంటూ భారీ స్థాయిలో శివజ్యోతి పై ట్రోల్స్ జరుగుతున్నాయి అయితే ఈ ట్రోల్స్ పై శివ జ్యోతి ఏ మాత్రం స్పందించలేదు మరి రేపు జరగబోయే ఎలక్షన్ కౌంటింగ్లో ఏ పార్టీ గెలవనుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube