ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన శివాజీ ( Shivaji ) మనస్సులో ఏదీ దాచుకోకుండా మాట్లాడతారనే సంగతి తెలిసిందే.ఈ విధంగా మాట్లాడటం వల్ల కొన్ని సందర్భాల్లో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య వల్ల శివాజీ ఇబ్బందులు పడిన సందర్భాలు సైతం ఉన్నాయి.
తాజాగా శివాజీ ఒక ఇంటర్వ్యూలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా( Naa Autograph Sweet Memories Movie ) గురించి మాట్లాడుతూ ఆ సినిమాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
శ్రీనివాసరెడ్డి నాతో ఉండేవారని మా కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అని శివాజీ తెలిపారు.
టాటా బిర్లా మధ్యలో లైలా నా సొంత సినిమా అని ఆయన అన్నారు.ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి పెద్ద డైరెక్టర్ అయ్యాడని ఆయన చెప్పుకొచ్చారు.నా ఆటోగ్రాఫ్ సినిమా డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారికి ఆ సినిమాలో హీరోగా నేను సరిపోనని అనిపించిందని శివాజీ కామెంట్లు చేశారు.వాస్తవంగా ఆ సినిమాకు సంబంధించి వినిపించిన పేర్లలో నా పేరు వచ్చిందని శివాజీ తెలిపారు.
ఆ సినిమాలో ఛాన్స్ వస్తుందని నేను భావించానని నాకు ఆ సినిమా బాగుంటుందని శివాజీ వెల్లడించారు.రవితేజ( Raviteja ) గారి ఇమేజ్ కు నా ఆటోగ్రాఫ్ సరిపోలేదని ఆయన పేర్కొన్నారు.నా ఆటోగ్రాఫ్ రైట్స్ కొనే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల మిస్ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.రవితేజ ఇమేజ్ కు ఆ సినిమా చిన్నదైందని శివాజీ పేర్కొన్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఎవరికి వాళ్లు పోటీ అని ఆయన చెప్పుకొచ్చారు.
స్టోరీ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నేను ఎక్కువగా నటించానని శివాజీ తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో టైమ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.బాపు గారి సినిమాలో నాకు ఛాన్స్ వచ్చిందని అయితే నా పాత్రలో ఆ తర్వాత శ్రీకాంత్ ఎంపిక అయ్యారని శివాజీ పేర్కొన్నారు.