షిర్డీ భక్తులకు శుభవార్త.. షిర్డీ బంద్ పై వెనక్కి వెళ్ళిన గ్రామస్తులు..!

సాయిబాబా భక్తులకు శుభవార్త షిర్డీ బంద్ పై గ్రామస్తులు వెనక్కి తగినట్లు సమాచారం.

మహారాష్ట్ర షిర్డీ( Shirdi ) లోని సాయిబాబా దేవాలయానికి సిఐఎస్ఎఫ్ భద్రత( CISF Security ) ఏర్పాటు చేశారు.

మే 1వ తేదీన తలపెట్టిన బంద్ నిర్ణయాన్ని గ్రామస్తులు వెనక్కి తీసుకున్నారు.స్థానిక ఎమ్మెల్యే, మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాధాకృష్ణ వీకే పటేల్ హామీతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు.

కొద్దిరోజులు క్రితం దేవాలయానికి సీఐఎస్ఎఫ్ భద్రతను వ్యతిరేకిస్తూ స్థానికులు మే ఒకటి నుంచి బందుకు పిలుపునిచ్చారు.సిఐఎస్ఎఫ్ భద్రత అవసరం లేదంటూ స్థానిక గ్రామస్తులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది.

స్థానికుల డిమాండ్లకు తలొగ్గి సీఐఎస్ఎఫ్ భద్రత విషయంలో న్యాయ పోరాటం చేస్తామని కూడా వెల్లడించింది.ఈ మేరకు మంత్రి రాధాకృష్ణ, వీకే పాటిల్ స్థానికులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు.

Advertisement

దీనితోపాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

అంతేకాకుండా ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్న కారణంగా షిర్డీ లోని సాయి మందిరానికి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.ప్రస్తుతం సాయిబాబా దేవాలయ భద్రత ఏర్పాట్లను స్థాయి సంస్థాన్ సిబ్బంది నిర్వహిస్తూ ఉంది.దేవాలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు( Maharashtra Police ) చూసుకుంటున్నారు.

ఇందులో భాగంగా దేవాలయాన్ని ప్రతిరోజు చేస్తుంది.

అయితే ఈ భద్రత వ్యవస్థకు బదులుగా సిఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలన్న చర్చ కూడా మొదలైంది.దీనిపై సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో బాంబే హైకోర్టులో ఔరంగాబాద్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన బెంచ్ సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కూడా కోరింది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
రోజు నైట్ త్వరగా నిద్ర పట్టడం లేదా.. అయితే ఇకపై ఇలా చేయండి!

అయితే సిఐఎస్ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ కూడా మద్దతు పలికినట్లు సమాచారం.అయితే ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్తులు వ్యతిరేకించి కోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు మే 1న షిర్డీ ని బంద్ చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చింది.

తాజా వార్తలు