Shilpa Shetty : హాఫ్ సెంచరీకి దగ్గరవుతున్నా వన్నె తరగని అందం శిల్పా శెట్టి సొంతం.. ఏమి అందం రా బాబు?

బాలీవుడ్( Bollywood ) బ్యూటీ ముద్దుగుమ్మ శిల్పా శెట్టి ( Shilpa Shetty )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Shilpa Shetty Ravishing In Her Latest Photoshoot Goes Viral On Social Media-TeluguStop.com

ముఖ్యంగా తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 48 సంవత్సరాలు.

హాఫ్ సెంచరీకి చేరువ అవుతున్నా కూడా ఇప్పటికీ 25 ఏళ్ల యువతీ లాగే కనిపిస్తూ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది.చెప్పాలి అంటే వయసుతో పాటు ఈమె అందం మరింత పెరుగుతోంది.48 ఏళ్ల వయసులో కూడా వన్నెతెరగని అందం శిల్పా శెట్టి సొంతం అని చెప్పవచ్చు.

Telugu Latest, Shilpa Shetty, Tollywood-Movie

ఈమె బాలీవుడ్ కి చెందిన హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటుంది.ఈమెకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

అంతేకాకుండా ఈమె పలు తెలుగు సినిమాలలో కూడా నటించి మెప్పించింది.ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా శిల్పా శెట్టి తెలుగు సినిమాలలో నటించబోతోంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కాగా ఈమెకు సోషల్ మీడియాలో 30.4 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Telugu Latest, Shilpa Shetty, Tollywood-Movie

దాదాపు 7 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత హిందీలో ‘ నికమ్మ సినిమాతో పాటు హంగామా 2( Hungama 2 ) చిత్రంతో పలకరించింది.హీరోయిన్‌గా పరిచయమైనపుడు ఎలాంటి ఫిగర్ ఉందో ఇప్పటికీ అదే శరీర సౌష్ఠవంతో అలరిస్తూనే ఉంది.తెలుగులో ఈమె సాహస వీరుడు సాగర కన్య,వీడెవడండీ బాబు, భలే వాడివి బాసు లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.తరచూ యోగ ఫిట్నెస్ జిమ్ అంటూ ఫిట్నెస్ కు సంబంధించిన విషయాలలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube