శిల్పాశెట్టి పెట్టుకున్న వాచ్ విలువ అన్ని లక్షలా..?

దాదాపు రెండు దశాబ్దాల క్రితం అందం, అభినయంతో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శిల్పాశెట్టి.

తెలుగులో శిల్పాశెట్టి హీరోయిన్ గా నటించిన ఆజాద్, భలేవాడివి బాసూ, సాహసవీరుడు సాగర కన్య సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా నటిగా ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

ఈ మధ్య కాలంలో శిల్పాశెట్టి సినిమాల్లో నటించకపోయినా టిక్ టాక్ వీడియోల ద్వారా, యోగాసనాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.అయితే శిల్పాశెట్టి పెట్టుకున్న వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా సామాన్యులు వాచ్ కోసం 500 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చు చేస్తారు.సెలబ్రిటీలు ఐతే వాచ్ ఖరీదు సాధారణంగా 2,00,000 రూపాయల వరకు ఉంటుంది.

అయితే శిల్పాశెట్టి పెట్టుకున్న్ వాచ్ విలువ మాత్రం ఏకంగా 16 లక్షల రూపాయలని తెలుస్తోంది.శిల్పాశెట్టి వాచ్ విలువ తెలిసి కొందరు నెటిజన్లు ఆ మొత్తంతో లగ్జరీ కారును కొనుగోలు చేయవచ్చంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

శిల్పాశెట్టి పెట్టుకున్న ఈ వాచ్ ఇంపోర్టెడ్ వాచ్ అని సమాచారం.ఈ వాచ్ తయారీలో ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ వాడారని అందువల్లే ఈ వాచ్ ఖరీదు ఇతర వాచ్ లతో పోల్చి చూస్తే చాలా ఎక్కువని తెలుస్తోంది.

వాచ్ లో నంబర్లను విలువైన స్టోన్స్ తో ప్లేస్ చేయడం, సఫైర్‌ స్టోన్‌ గ్లాస్ ‌ను కలిగి ఉండటం ఈ వాచ్ ప్రత్యేకత.రోజ్ గోల్డ్ స్ట్రాప్ తో తయారైన ఈ వాచ్ ను కొనుగోలు చేయడం కూడా అంత తేలిక కాదని తెలుస్తోంది.మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శిల్పాశెట్టి తరచూ తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.2009 సంవత్సరం నవంబర్ నెలలో రాజ్ కుంద్రాను శిల్పాశెట్టి పెళ్లి చేసుకున్నారు.శిల్పా రాజ్ దంపతులకు వియాన్, సనీహా సంతానం.

.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు