బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా గురించి మనందరికి తెలిసిందే.కాగా రాజ్ కుంద్రా ( Raj Kundra )పేరు మని ల్యాండరింగ్ కేసు సమయంలో బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలో మారు మోగిన విషయం తెలిసిందే.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా రాజ్‌కుంద్రా ట్విట్టర్లో చేసిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం సంచలనంగా మారింది.మేము విడిపోయాం.
దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.దీనికి గుండె ముక్కలైన ఎమోజీతో పాటు చేతులు జోడిస్తున్న గుర్తును జత చేశాడు.
అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన ఈ ట్వీట్ చేశాడు.ఆ ట్వీట్ చూసిన అభిమానులు జనాలు అదేంటి శిల్పా శెట్టి( Shilpa Shetty ) ఆమె భర్త ఎదురు విడాకులు తీసుకుంటున్నారా? మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా అంతలోనే ఏమయ్యింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం ఆయన విడిపోతుంది తన భార్యతో కాదు మాస్క్‌తో( Raj Kundra Mask ) అని అభిప్రాయపడుతున్నారు.కాగా 2021లో నీలిచిత్రాల కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా కొంతకాలం పాటు జైలు జీవితం గడిపాడు.
బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియాకు తన ముఖం చూపేందుకు కూడా ఇష్టపడలేదు.ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒక మాస్క్‌తోనే కనిపించేవాడు.
కాగా ఇటీవలే రాజ్ కుంద్రా తన జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.యూటీ 69( UT69 ) అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీలో రాజ్‌కుంద్రా ప్రధాన పాత్రలో నటించాడు.కాగా చాలాకాలంగా మాస్క్ చాటున ముఖం దాచుకుంటున్న అతడు యూటీ 69 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్క్ తీసేసి మీడియా ముందు కనిపించాడు.బహుశా మాస్క్‌తో ఇక సంబంధం లేదని ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది.కాగా రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి 2009లో పెళ్లి చేసుకున్నారు.వీరికి వియాన్, సమీషా అని ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.