బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే.ఆ సమయంలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా పేర్లు ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీలో మార్మోగిపోయాయి.
కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రాజ్ కుంద్రా కేసు గురించే వార్తలు వినిపించాయి.ఇకపోతే రాజ్ కుంద్రా బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
అప్పటినుంచి మీడియా కంట కనపడకుండా.జాగ్రత్త పడుతూ తప్పించుకుంటున్నారు రాజ్ కుంద్రా.
బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ విషయంపై రాజ్ కుంద్రా స్పందించలేదు.
తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ ఒక స్టేట్మెంట్ ను విడుదల చేశాడు.
ఈ విషయంపై నేను సైలెంట్ గా ఉండటం వల్ల తప్పుదారి పట్టించే విధంగా చాలా బాధ్యతా రహితమైన ప్రకటనలు అలాగే కథనాలు వెలువడుతున్నాయి.నా మౌనం తప్పు చేసిన దానికి అంగీకారంగా మీరు భావిస్తున్నారు.
అందుకే ఎంతో ఆలోచించి ఈ విషయంపై స్పందిస్తున్నాను.నేను నా జీవితంలో ఎప్పుడూ పోర్నోగ్రఫీ తీయడం కానీ అమ్మడం కానీ చేయలేదు.
ఈ మొత్తం అంతా మంత్రగాడి వేట తప్ప మరొకటి కాదు.కొన్ని కొన్ని కారణాల వల్ల పూర్తి వివరాలు బయటకు చెప్పలేను.

నాకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది అందుకే విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ట్రోలింగ్ ప్రతికూలత విషపూరిత ప్రజల అవగాహన మా కుటుంబాన్ని నన్ను చాలా బలహీన పరిచాయి.ఇదే విషయాన్ని సరిగ్గా సెట్ చేయడానికి నేను సిగ్గుతో నా ముఖాన్ని దాచుకోను.కాకపోతే ఇలా నిరంతరమైన మీడియా ట్రయల్ తో నా గోప్యతకు భంగం కలగకూడదని నేను కోరుకుంటున్నాను.
నా ప్రాధాన్యత ఎల్లప్పుడూ నా కుటుంబమే.వేరే విషయాల గురించి నాకు అవసరం లేదని తెలిపాడు రాజ్ కుంద్రా.