ఫ్రెండ్ అని ఆ హీరోయిన్ భర్తని నమ్మితే అలాంటి వీడియోలలో నటించమని...

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో పలు బోల్డ్ చిత్రాల్లో నటించడంతో పాటు మోడలింగ్ రంగంలో కూడా ప్రారంభించి బాగానే గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ “షెర్లిన్ చోప్రా” గురించి సినీ ప్రేక్షకుల కి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో షెర్లిన్ చోప్రా కి హిందీ సినిమా పరిశ్రమలో అశ్లీల చిత్రాలు హారంలో అరెస్టయిన రాజ్ కుంద్రాతో కూడా సత్సంబంధాలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

 Sherlyn Chopra Sensational Comments On Raj Kundra Issue, Sherlyn Chopra, Sherlyn-TeluguStop.com

దీంతో తాజాగా షెర్లిన్ చోప్రా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయంపై స్పందించింది.ఇందులో భాగంగా తనకి శిల్పా శెట్టికి మధ్య స్నేహబంధం ఉన్న మాట వాస్తవమేనని తెలిపింది.

అయితే గతంలో శిల్పా శెట్టి వల్లే తన భర్తతో పరిచయం ఏర్పడిందని కానీ రాజ్ కుంద్రా ఇలాంటి అశ్లీల చిత్రాల వ్యవహారంలో ఇరుక్కుంటాడని కలలో కూడా అనుకోలేదని తెలిపింది.కానీ అప్పుడప్పుడు రాజ్ కుంద్రా తనతో తన వీడియోలను శిల్పాశెట్టి బాగా ఇష్టపడుతుందని చెబుతూ ఉండేవాడని తెలిపింది.

దీనికితోడు బాలీవుడ్ సినిమా పరిశ్రమలో బడా నిర్మాతల సంస్థలలో పనిచేసే అవకాశం రావడంతో బోల్డ్ షో, స్కిన్ షో వంటివాటి పాత్రలలో నటించానని అంతేతప్ప తనకు ఆ చిత్రాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది.

Telugu Bollywood, Raj Kundra, Sherlyn Chopra, Sherlynchopra-Movie

అయితే ప్రస్తుతం పోలీసులు మాత్రం ఈ అశ్లీల చిత్రాల వ్యవహారాన్ని చాలా లోతుగా విచారిస్తున్నారు.ఇప్పటికే బాలీవుడ్లో పలు ప్రముఖ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించిన నటి మరియు ప్రముఖ మోడల్ “నందిత దత్త” ని కూడా పోలీసులు అరెస్టు చేశారు.కాగా ఇటీవలే ఇద్దరు యువతులు తమని బలవంతంగా అశ్లీల చిత్రాలలో నటించడానికి ఒత్తిడి తెస్తోందని నందిత దత్త పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సినిమా సెట్స్ లో షూటింగులో ఉండగానే నందిత దత్త ని అరెస్టు చేశారు.

అంతేకాకుండా బాలీవుడ్లో పలు స్పెషల్ సాంగ్స్ మరియు తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన గేహనా వసిష్ట్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube