ప్రజెంట్ సొసైటీలో దొంగలు పెరిగిపోతుండటం మనం గమనించొచ్చు.అయితే, బయట కనిపించే దొంగలను పట్టుకోవడం ఈజీనే.
కానీ, ఇంటి దొంగలను పట్టుకోవడం చాలా కష్టం.మనం తెలుసుకోబోయే ఈ స్టోరీ ఆ కోవకు చెందినదే.
సామగ్రిని రక్షించాల్సిన వారే వాటిని తినేస్తున్నారు.ఈ క్రమంలోనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఆ వివరాలేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.
సాధారణంగా పోలీసులు అనగానే కొందరు వాహనదారులకు భయం వేస్తుంది.
ఏవేవో రూల్స్ మాట్లాడి ఫైన్స్ విధిస్తారానో వారు పోలీసులకు కనపడకుండా ఉండే ప్రయత్నం చేస్తుంటారు.ఇక ఒకవేళ బైక్ కానీ లేదా ఇంకేదో వాహనం కానీ వారి కంటపడిందంటే చాలు తనిఖీలు నిర్వహించి ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఇతరాల గురించి అడిగి అవి ఏవి లేకపోయినా సీజ్ చేస్తుంటారు.
ఇక చలానా పెండింగ్‌లో ఉంటే కూడా బండిని సీజ్ చేసే రోజులు రాబోతున్నాయి.కాగా, అలా సీజ్ చేసిన వాహనాలను భద్రపరచాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్ వాటిని అమ్మేసుకుంటుంది.
ఎక్కడంటే.మహారాష్ట్రలోని వసాయి పోలీస్ స్టేషన్‌లో.
ఈ పీఎస్‌లో స్టోర్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ ఏవేవో రీజన్స్‌తో సీజ్ చేయబడిన వెహికల్స్, ఇతర సామగ్రిని ఓ డీలర్‌తో ఒప్పందం కుదుర్చుకుని బేరానికి పెట్టి అమ్మేస్తోంది.
ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో పలు ఆరోపణలు వినిపించాయి.దాంతో పోలీసులు కొద్ది రోజుల పాటు రెక్కీ నిర్వహించారు.సదరు మహిళా పోలీస్ కానిస్టేబుల్, డీలర్ ముస్తాక్‌కు వెహికల్స్, సామగ్రి సేల్ చేసే సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ క్రమంలో వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి.ఇప్పటికే మహిళా కానిస్టేబుల్ రూ.26 లక్షల విలువైన వస్తువులను దొంగిలించి సేల్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటి దొంగను పట్టుకోవడానికి ఇంత సమయం పట్టిందని కామెంట్ చేశారట.