సినిమాలో నటిస్తున్న హీరోయిన్స్ కి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు అనే ఒక అభిప్రాయం ఉంటుంది.ఇది నేటి రోజుల్లో నిజమే అయినప్పటికీ నాటి రోజుల్లో మాత్రం అలా కాదు.
హీరోయిన్ అయినా మరే పాత్ర అయినా కూడా ప్రాధాన్యత కచ్చితంగా ఉండేలా చూసుకునేవారు అప్పటి నటి నటులు మరియు దర్శకనిర్మాతలు.అంతే కాదు హీరోయిన్ తో సమానంగా పారితోషకం తీసుకునే నటీమణులు కూడా సినిమాలో ఉండేవారు.
అలా హీరోయిన్ గా నటించిన, సెకండ్ హీరోయిన్ గా నటించిన, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన హీరోయిన్ తో సమానంగా పారితోషకం అందుకున్న నటీమణి షావుకారు జానకి.
జానకి అనే పేరుకు షావుకారు సినిమా తర్వాత ఆ షావుకారు జానకి అనే నామకరణం జరిగింది.
నిజానికి షావుకారు అని మొదటి సినిమా అని అందరూ పొరపడుతుంటారు.అంతకుముందే ఆమె చిన్నచితక పాత్రలో కొన్ని సినిమాల్లో నటించింది.కానీ ఎన్టీఆర్ తో నటించిన షావుకారు సినిమా అద్భుతంగా ఉంటుంది.అంతేకాదు ఎన్టీఆర్ కి దీటుగా జానకి నటించడంతో ఆ సినిమాలో జానకికి మంచి పేరు రావడమే కాదు అదే సినిమా పేరు తన ఇంటి పేరుగా మారింది.
ఇక పారితోషకం విషయంలో మాత్రం జానకి చాలా నిక్కచ్చిగా ఉండేదని చాలామంది చెప్తూ ఉంటారు.

తనను సినిమాలో బుక్ చేసుకోవడానికి వచ్చిన ఎవరికైనా సరే హీరోయిన్ తో సమానంగా పారితోషకం ఇస్తేనే నటిస్తాను అని ఖచ్చితంగా చెప్పే వారట.అలా ఎందుకు ఇవ్వాలమ్మ మీరు ఏమి హీరోయిన్ కాదు కదా.మీరు సెకండ్ హీరోయిన్ కదా అని ఎవరైనా అంటే నేనేమన్నా హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకోవడం లేదా నన్నే హీరోయిన్ గా బుక్ చేసుకోండి అంటూ గడుసుగా సమాధానం చెప్పే వారట.అప్పట్లో ఆమెకు మహిళల్లో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అంతటి రెమ్యూనరేషన్ ఇచ్చి మరి బుక్ చేసుకునే వారట.

నిజానికి ఆ సమయంలో షావుకారు జానకి కుటుంబం ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉండడంతో ఆమె డబ్బుల విషయంలో గడుసుగా ప్రవర్తించేవారు.కానీ ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన,. సంసారం ఒక చదరంగం, తాయారమ్మ, బంగారయ్య వంటి సినిమాలు అప్పట్లో సూపర్ పాపులర్ అయ్యాయి దాంతో ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు వచ్చింది.








