టాలీవుడ్ సినీ హీరో శర్వానంద్( Sharwanand ) ఈనెల మూడవ తేదీ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా రక్షిత రెడ్డి ( Rakshitha Reddy ) మెడలో మూడు ముళ్ళు వేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా శర్వానంద్ వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ఇలా జైపూర్లో కేవలం కుటుంబ సభ్యులు అతికొద్దీ మంది సినీ సెలబ్రిటీల సమక్షంలో శర్వానంద్ రక్షితల వివాహం ఎంతో కన్నుల పండుగగా జరిగింది.వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటున్నటువంటి ఈ హీరో అనంతరం జూన్ 9వ తేదీ హైదరాబాదులో ఎంతో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకను ( Wedding Reception Event ) జరుపుకున్నారు.ఈ రిసెప్షన్ వేడుకకు పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలను ఆహ్వానించడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు అందరు కూడా శర్వానంద్ రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు.సినీ తారల సమక్షంలో శర్వానంద్ వివాహ రిసెప్షన్ వేడుక ఎంతో వైభవంగా జరిగింది.ఇలా పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి ఈ నూతన దంపతులు వివాహం అనంతరం మొదటిసారి తిరుమల శ్రీవారిని (

v class=”middlecontentimg”>
నేడు వేకు జామున శర్వానంద్ దంపతులు అభిషేక సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.ఇలా స్వామివారి దర్శనం అనంతరం శర్వానంద్ దంపతులు రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా ఆలయ అధికారులు ఈ దంపతులకు స్వామివారి పట్టు వస్త్రాలను సమర్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక శర్వానంద్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్నారు.ఈమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనే సంగతి మనకు తెలిసిందే.







