టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న వాళ్లలో శర్వానంద్( Sharwanand ) ఒకరు.ఈయన కంటే చిన్న హీరోలు పెళ్లి చేసుకున్న కూడా మొన్నటిదాకా శర్వానంద్ పెళ్లి( Sharwanand Marriage ) మ్యాటర్ దటవేసుకుంటు వచ్చేవాడు కానీ ఎట్ట కేలకు మూడుముళ్ల బంధంతో జూన్ మూడవ తేదీన కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ కి చెందిన రక్షిత రెడ్డి( Rakshitha Reddy ) అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ఆయన పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ఇక నిన్న వీరి వివాహానికి సంబంధించిన పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట చాలా వైరల్ గా మారాయి.
ఒకవైపు పెళ్లి ఫోటోలు వైరల్ గా మారుతున్న నేపథ్యంలో మరొకవైపు పెళ్లిలో గొడవలు జరిగాయి అని.అప్పుడే భార్యకు శర్వానంద్ కండిషన్ లు పెట్టాడు అని.అందుకు తగ్గట్టుగానే తాను కూడా పెళ్లి తర్వాత కొద్దిరోజులు వాటికి దూరం కానున్నాడు అంటూ వార్తలు బాగా బలంగా వినిపిస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళితే.హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురు రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్న శర్వానంద్… మూడు ముళ్ళు అలా పడ్డాయో లేదో ఇలా భార్యకు కండిషన్స్ పెట్టాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.అయితే అది సీరియస్ గా కాదు కానీ ఆమెకు ఫోటోలకు ఫోజులు ఎలా ఇవ్వాలో తెలియకపోవడంతో ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టాలి ఫోటోలకు ఫోజులు ఇవ్వాలి అని అప్పుడే భార్యకు అన్నీ నేర్పించేస్తున్నాడు శర్వానంద్…
అంతేకాదు భార్య రక్షిత రెడ్డి పై ప్రేమ ఎక్కువగా చూపిస్తున్నారని… ఓవర్ గా కేర్ తీసుకుంటున్నారు అంటూ కళ్యాణ మండపంలో ఆయన బిహేవ్ చేసిన పద్ధతి ఇప్పుడు ట్రెండీగా మారింది.అంతేకాదు శర్వానంద్ స్నేహితులు తాగి పెళ్లిలో పెద్ద గొడవ చేశారు అని, కానీ ఫైనల్ గా ఎట్టకేలకు అంత కూల్ గా సద్దుమణిగి ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగిందని సమాచారం…
ఇకపోతే తన భార్యపై ఆయనకున్న ప్రేమ కారణంగానే కొన్ని రోజులు సినిమా షూటింగ్లకు దూరంగా ఉండి భార్యతో మంచి సమ్మర్ వెకేషన్ కి ప్లాన్ చేస్తున్నారట శర్వానంద్.కొన్ని నెలలు సంతోషంగా ఏకాంతంగా గడిపిన తర్వాత మళ్లీ తన పనిలో తాను బిజీ కానున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా బ్యాచిలర్ లైఫ్ వీడి కొత్త జీవితాన్ని మొదలుపెట్టి.భార్య కోసం తన సమయాన్ని కేటాయిస్తున్న శర్వానంద్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు…
.