ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ఒక్కో జోనర్ లో సినిమాలు చాలా తక్కువుగా వస్తూ ఉంటాయి.ఎందుకంటే అక్కడి ప్రేక్షకుల మైండ్ సెట్ ను బట్టి డైరెక్టర్లు సినిమాలు చేస్తుంటారు.
మరి సినిమాల్లో ఇప్పటికే చాలా జోనర్స్ వచ్చాయి.అందులో టైం ట్రావెల్ నేపథ్యం కూడా ఉంది.
మిగతా ఇండస్ట్రీలను పక్కన పెడితే.
మన తెలుగులో మాత్రం టైం ట్రావెల్ కాన్సెప్ట్ లో వచ్చిన మొదటి సినిమా ఆదిత్య 369.ఈ సినిమాలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కించి ఆడియెన్స్ ను మెప్పించారు.ఇక ఆ తర్వాత తెలుగులో ఈ జోనర్ లో సినిమాలు చాలా తక్కువుగానే వచ్చాయి.
అందులో మన ప్రేక్షకులకు నచ్చిన సినిమా 24
సూర్య హీరోగా విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కూడా ఇదే జోనర్ లో వచ్చి ఆడియెన్స్ ను అలరించింది.ఇక మళ్ళీ ఈ జోనర్ లో చెప్పుకోదగ్గ టైం ట్రావెల్ సినిమాలు రాలేదు.
ఎందుకంటే ఈ జోనర్ లో సినిమాలు చేయాలంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పక్కా స్క్రిప్ట్ తో.ఎక్కువ బడ్జెట్ తో అందరికి అర్ధం అయ్యేలా చూపించగలిగితేనే ఇలాంటి జోనర్స్ హిట్ అవుతాయి.

అయితే చిన్న బడ్జెట్ తో కూడా ఇలాంటి ఒక సినిమా తీయవచ్చు అని అర్ధం అయ్యేలా చెప్పిన సినిమా ఒకే ఒక జీవితం.విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించే శర్వానంద్ ఈసారి టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నాడు.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో శ్రీ కార్తీక్ తెరకెక్కించారు.ఈ సినిమా ఆడియెన్స్ కు మెల్లగా ఎక్కుతూ ఉండడంతో హిట్ లిష్టులోకి చేరిపోయింది.
దీంతో ఇప్పుడు ఈ టైం ట్రావెల్ జోనర్ కూడా హిట్ ఫార్ములాగా మారిపోయింది.







