తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సవాల్ విసిరారు.అసెంబ్లీలో కేసీఆర్ విద్యుత్ బిల్లుకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని నిరూపిస్తానన్నారు.
కేంద్ర విద్యుత్ బిల్లు అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.మోటార్లకు మీటర్లు పెట్టాలని బిల్లులో ఉంటే రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు.
లేని పక్షంలో సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.తెలంగాణ సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.







