యంగ్ హీరో సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నాడేం?

యంగ్ హీరో శర్వానంద్ సూపర్ హిట్ సొంతం చేసుకుని చాలా సంవత్సరాలు అయింది.2017 సంవత్సరంలో శతమానం భవతి సినిమా తో సక్సెస్ ను సొంతం చేసుకున్న శర్వానంద్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా కూడా ఏ ఒక్కటి ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.

గత ఐదు సంవత్సరాలుగా ఒక భారీ కమర్షియల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న శర్వానంద్ ఈ సంవత్సరంలోనైనా ఆ కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకుంటాడేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ ఈ సంవత్సరం లో ఇప్పటి వరకు శర్వానంద్ కొత్త సినిమా లు ఏమీ కమిట్ అవ్వలేదు.

గత సంవత్సరం ఆడవాళ్లు మీకు జోహార్లు మరియు ఒకే ఒక్క జీవితం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఒకే ఒక్క జీవితం సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా మంచి పేరు తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు.ఇక శర్వానంద్ వ్యక్తిగత విషయానికి వస్తే ఇటీవల వివాహం నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్ త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు.

ఆ కారణంగా కొత్త సినిమాలు కమిట్ అవ్వలేదా అంటూ కూడా కొందరు చర్చించుకుంటున్నారు.

Advertisement

శర్వానంద్ హీరోగా వరుసగా సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.కానీ ఈ సంవత్సరం లో ఒక్క సినిమా ను కూడా శర్వానంద్ విడుదల చేస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.శర్వానంద కొత్త సినిమా ఇప్పటికిప్పుడు ప్రారంభించిన కూడా ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

కానీ కొత్త సినిమా ఈ ఏడాది ప్రారంభిస్తాడా లేదా అనేది చూడాలి.కెరీర్ ఆరంభం లో ఎన్నో విభిన్నమైన కథ సినిమా లతో వచ్చిన శర్వానంద్ ఇప్పుడు మాత్రం కమర్షియల్ సినిమాల వెంట పడుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు