బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే కలిసిన నటించిన సినిమా పఠాన్.ఈ సినిమా ఈ ఏడాది జనవరి 25వ తేదీన భారీ అంచనాల నడుమ గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తూ రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది.ఇప్పటికే బాహుబలి కే జి ఎఫ్ లాంటి రికార్డులను సైతం కొల్లగొట్టిన ఈ సినిమా దాదాపుగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది.
చాలాకాలం తర్వాత సినిమాతో బాలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్ ఖాన్,దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటించగా జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా, ఆశుతోష్ రానా కీలకపాత్రలో నటించారు.సినిమాను 250 కోట్ల బడ్జెట్ తో ఎస్ రాజు ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన విషయం తెలిసిందే.ఊహించని విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకోవడంతో పాటు పాన్ ఇండియా వైస్ మాత్రమే కాకుండా కొంచెం వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అయ్యి కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా అభిమానులకు చిత్ర బృందం ఒక చక్కని శుభవార్తను తెలిపింది.

అదేమిటంటే సినీ ప్రియల కోసం యష్ రాజు ఫిలిమ్స్ సంస్థ ఒక క్రేజీ ఆఫర్ ని ప్రకటించింది.పఠాన్ సినిమా టికెట్లపై మూడు రోజులపాటు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా పొందవచ్చని తెలిపింది.
కాగా ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఈ ఆఫర్ హిందీ,తమిళం తెలుగు భాషల్లో మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.
పఠాన్ సినిమా సెలబ్రేషన్స్ పేరుతో ఈ ఆఫర్లను ప్రకటించింది చిత్ర బృందం.పటాన్ సినిమా కోడ్ ఉపయోగించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది.
అయితే ఈ ఆఫర్ కేవలం మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో మాత్రమే ఉంటుందని, ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ కింద టికెట్ ను కేటాయించినట్లు తెలిపింది.ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







