హైదరాబాద్ బాలాపూర్ లో ఓ యువకుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు.తనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను అపహరించుకుని వెళ్లారని హల్ చల్ చేశాడు.
బాలాపూర్ కు చెందిన రమేశ్ అనే యువకుడు తనను కిడ్నాప్ చేశారంటూ ఫొటోలు, వీడియోలు పంపాడు.ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాప్ వ్యవహారం అంతా డ్రామా అని తేల్చారు.
ఇందులో భాగంగా రమేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది.తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు తెలిపారు.







