మేటర్ లేనిది ఇద్దరు సూపర్‌ స్టార్స్ నటించినా ప్రయోజనం శూన్యం

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో రూపొందిన స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.షారుక్ ఖాన్( Sharukh Khan ) నటించిన పఠాన్ చిత్రం సూపర్ హిట్ అయి రూ.1,000 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది.కానీ ఇతర స్టార్ హీరోలు నటించిన సినిమాలు మాత్రం కనీసం రూ.100 కోట్ల కలెక్షన్స్ ని కూడా రాబట్ట లేక ఢీలా పడిపోతున్నాయి.ఆ మధ్య ఇద్దరు హీరోలు కలిసిన నటించిన ఒక హిందీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూట కటుకుంది.

 Sharukh Khan And Salman Khan Movie Not Getting Hype Details, Sharukh Khan, Salma-TeluguStop.com

అంతే కాకుండా బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ నటించబోతున్న సినిమా కి కూడా పెద్దగా బజ్ క్రియేట్‌ కాలేదు.

వీరిద్దరూ కలిసి నటించినంత మాత్రాన సినిమాలో మ్యాటర్ లేకుంటే ప్రేక్షకులు ఎగబడి చూస్తారు అనుకుంటే పొరపాటే.జనాలు చూడాలంటే సినిమా లో మ్యాటర్ ఉండాలి కానీ స్టార్స్ కాదని ఇప్పటికే పలు సినిమాలు నిరూపించాయి.కనుక భారీ బడ్జెట్ ఖర్చు చేసి అనవసరంగా హంగామా చేయకుండా మంచి సబ్జెక్టు తో సల్మాన్ ఖాన్( Salman khan ) మరియు షారుక్ ఖాన్ సినిమాలను తీయాలని అభిమానులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా ఆసక్తి ఉంటుంది.కానీ ప్రేక్షకులు మేటర్ లేకుండా సినిమా ని చూడ్డానికి థియేటర్ కి హాజరయ్యే అవకాశాలు లేనే లేవు అంటూ బాలీవుడ్ విశ్లేషకులు( Bollywood ) అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సౌత్‌ లో మాత్రం స్టార్ హీరోల మల్టీ స్టార్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.కానీ ఉత్తరాదిని మాత్రం మల్టీ స్టార్ సినిమాలు బోర్ కొట్టించాయి అంటూ అక్కడి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.

ఈ సమయం లో ఈ ఇద్దరు సూపర్ స్టార్ కలిసిన నటిస్తే ఆ సినిమా పరిస్థితి ఏంటో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube