శరణ్య పొన్వన్నన్( Sharnya ponvannan ).సౌత్ ఇండియన్ హీరోలకు తల్లిగా ఈమెకు మంచి పేరు ఉంది.
హీరో ఎవరైనా సరే తల్లి పాత్రలో మాత్ర శరణ్య ఉండాల్సిందే.ఎమోషన్ తో కూడిన మదర్ రోల్స్ లో శరణ్య అనేక సినిమాల్లో నటించింది.
ఇప్పుడు అంటే ఆమె తల్లి పాత్రలు చేస్తుంది కానీ ఆమె ఏకంగా ఒక దశాబ్దం పాటు హీరోయిన్ గా సౌత్ ఇండియాలో చెలామణి అయ్యింది.ఆమె సౌత్ లోని అన్ని భాషల్లో హీరోయిన్ గా స్టార్ హీరో ల సరసన నటించింది.
నిజానికి శరణ్య తండ్రి మలయాళ ఇండస్ట్రీ లో 75 సినిమాలను తెరకెక్కించిన ఒక దర్శకుడు.అందుకే ఆమెకు సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వడం చాల సులభంగా జరిగిపోయింది.

పేరుకి మలయాళీ అయినా కూడా మణిరత్నం తీసిన నాయకన్ సినిమాలో కమల్ హాసన్( Kamal Haasan ) పక్కన హీరోయిన్ గా తొలిసారి తమిళ చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.కమల్ లాంటి హీరో పక్కన నటించిన శరణ్య, నటనలో అతడితో పోటీ పడి మరి నటించింది.1987 లో ఈ సినిమా రాగా ఈ చిత్రంలో తెలుగు లో నాయకుడు అనే పేరుతో విడుదల అయ్యి నేటికీ తమిళ్ మరియు తెలుగు సినిమాల్లో ఒక క్లాసిక్ సినిమాగా ఉండిపోయింది.ఇక ఇదే ఏడాది మలయాళం లో సైతం శరణ్య తన డెబ్యూ చేసింది.
అర్థం అనే మలయాళ సినిమాలో మమ్ముట్టి పక్కన నటించింది.ఇక తెలుగు లో సైతం నీరాజనం అనే చిత్రంలో నటించింది.

కెరీర్ చివర్లో ఆమె కన్నడ సినిమా ( kannada movies )అప్పాజీ లో నటించి అక్కడ కూడా హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసింది.ఈ సినిమా తర్వాత ఆమె హీరోయిన్ గా నటించడం మానేసి పొన్వన్నన్ ని వివాహం చేసుకుంది.ఆ తర్వాత ఇద్దరు కూతుళ్ళకు జన్మ ఇచ్చింది.ఆ తర్వాత ఒక నాలుగు ఏళ్లకు టీవీ ఇండస్ట్రీ ద్వారా మళ్లి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.ఆలా కొన్నేళ్ల పాటు సీరియల్స్ లో నటించి మళ్లి సినిమా ఇండస్ట్రీ కి 2003 లో తల్లి పాత్రల్లో నటించడం మొదలు పెట్టింది.హీరో శింబు కి తల్లి గా అలై సినిమాలో చేసింది.
ఈ సినిమా ఆమెకు వందో సినిమా కావడం విశేషం.అంటే హీరోయిన్ గా 99 ఏళ్ళు పూర్తి చేసుకున్న శరణ్య అప్పటి నుంచి తల్లి పాత్రల్లోనే కనిపిస్తుంది.
ఇక నటన తో పాటు ఆమె ఒక ఫ్యాషన్ హౌస్ కూడా రన్ చేస్తుంది.







