వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ( YS Sharmila ) అనుసరిస్తున్న వ్యూహాలు ప్రణాళికలు ఆమె పార్టీ నేతలకు సైతం అర్థం కావడం లేదు.మొదట ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని, తెలంగాణలో రాజన్న పాలన తీసుకొస్తామని చెప్పుకొచ్చిన షర్మిల.
ఆ తరువాత కొన్ని రోజులు పాదయాత్రలు పర్యటనలు చేసి నానా హడావిడి చేశారు.కానీ ఎన్ని చేసిన ప్రజల దృష్టి మాత్రం ఆకర్షించలేకపోయారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బ తినడం ఖాయమని భావించిన ఆమె.మెల్లగా కాంగ్రెస్( Congress ) వైపు అడుగులు వేస్తూ వచ్చారు.తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు గట్టిగానే ప్రయత్నించారు.కానీ హస్తం పార్టీ మొదట ఆమె రాకను స్వాగతించినప్పటికి ఆ తరువాత వెనుకడుగు వేసింది.

హస్తం పార్టీ నుంచి తనకు పిలుపు వస్తుందని షర్మిల భావించినప్పటికి అలాంటిదేమీ జరగలేదు, దీంతో ఆమె మళ్ళీ సొంత పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే మొదట విలీనం అడుగులు వేయడంతో ఆమె పార్టీలోని చాలమంది నేతలు ఇప్పటికె ఇతర పార్టీల గూటికి చేరారు.ఇక ఉన్న కొంతమంది పార్టీ నేతలనైనా నిలుపుకోవాలని షర్మిల ( YS Sharmila ) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఎన్నికల్లో దాదాపు 100కు పైగా స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను నిలిపే ఆలోచనలో ఆమె ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
నేడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ( YSR Telangana Party )కి సంబంధించిన కార్యవర్గ సమావేశం జరుగుతుంది.

ఈ సమావేశంలో ఆమె అభ్యర్థుల ఎంపిక, తను పోటీ చేయబోయే స్థానం వంటి తదితర అంశాలపై నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తోంది.ఆమె మిర్యాల గూడ నుంచి పోటీ చేస్తూ తన తల్లి విజయమ్మ( Y.S.Vijayamma ) ను పాలేరు బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నారట.కాగా ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల ( BRS Congress BJP parties ) మద్యనే కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్రంలో ఎంతమేర ప్రభావం చూపుతుందనేది ప్రశ్నార్థకమే.ఒకవేళ తెలంగాణలో అనుకున్న స్థాయిలో ఆమె పార్టీ విజయం సాధించకపోతే నెక్స్ట్ షర్మిల ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఆమె తెలంగాణకు గుడ్ బై చెప్పి మళ్ళీ ఆంధ్ర పాలిటిక్స్ పై దృష్టి పెట్టిన ఆశ్చర్యం లేదనేది కొందరి వాదన.మరి ఏం జరుగుతుందో చూడాలి.