షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం దిశగా సాగుతుందా?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.కన్నడ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ని రెండవసారి కలిసిన షర్మిల ప్రయాణం ఆ దిశగానే సాగుతున్నట్లు తెలుస్తుంది .

 Sharmila Paty Going To Merge Congress, Ysr Telangana Party , Ys Sharmil, Ts Pol-TeluguStop.com

మొదటిసారి శివకుమార్( DK Shivakumar ) ని విజయం సాధించిన సందర్భంగా అభినందించడానికి కలిశానని చెప్పిన షర్మిల(Y.S.Sharmila ) ,రెండవసారి కలవడానికి గల కారణాలు ప్రత్యేకంగా ఏమీ లేవు, ఆమె గత కొంతకాలంగా తెలంగాణలో తన శక్తి మేరకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పార్టీకి కావలసిన గుర్తింపు , ఆదరణ ప్రజల్లో కలగడం లేదు.బడా నేతలు పక్కన పెడితే చోటామోటా నేతలు కూడా పార్టీ వైపు ఆకర్షించబడలేదు .ఇద్దరు ముగ్గురు కీలక నేతల పార్టీలో చేరతారని వార్తలు వచ్చినప్పటికీ చివర నిమిషంలో వారు పక్కకు తప్పుకున్నారు .ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలలో పోటీ చేస్తే పార్టీ ఆశించిన ప్రయోజనాలు పొందటమని అర్థం చేసుకున్న షర్మిల ఇప్పుడు కొత్త రాజకీయాల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Cm Kcr, Congress, Dk Shivakumar, Karnataka, Ts, Ysjagan, Ys Sharmil, Ysr

రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా ఆమెకి అంతో ఇంతో చరిష్మా ఉందని నమ్ముతున్న కాంగ్రెస్ అధిష్టానం ఆమెను తెలంగాణలో క్యాంపెనర్ గా వాడుకోవాలని అలానే ఆంధ్ర కాంగ్రెస్ పగ్గాలు కూడా అప్పజెప్పాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.ఈ దిశగా ప్రయంగా గాంధీ షర్మిల తో ఫోన్లో మాట్లాడారని, ప్రాథమికంగా ఒక అంగీకరానికి వచ్చినప్పటికీ భవిష్యత్తు కార్యాచరణ పై ఇరు పార్టీ ల మధ్య స్పష్టత రావాల్సి ఉన్నట్లుగా చెబుతున్నారు .

Telugu Cm Kcr, Congress, Dk Shivakumar, Karnataka, Ts, Ysjagan, Ys Sharmil, Ysr

ఆ దిశ గానే పీకే శివకుమార్ ని కలిసిన షర్మిల తన షరతులను ఆయన ముందు ఉంచారని, ఆయన హై కమాండ్ తో చర్చించి చర్చలకు తుది రూపం తీసుకువస్తారని చెబుతున్నారు.కాంగ్రెస్ పార్టీ విలీనం వైపుగా ప్రతిపా,దిస్తుంటే షర్మిల పొత్తు గురించి మాట్లాడుతున్నారని తెలంగాణలో 30 నుంచి 40 సీట్లు ఆమె ఆశిస్తున్నారని తెలుస్తుంది.అయితే పూర్తిస్థాయి సమాలోచనల తర్వాత షర్మిల పార్టీ విలీనం దిశగానే సాగుతుందని ,ఆంధ్ర కాంగ్రెస్పై పెత్తనం అప్పగించడం ద్వారా తెలంగాణలో పార్టీని విలీనం చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.ఏది ఏమైనా జగన్ ( YS Jagan Mohan Reddy )విడిచిన బాణం గా తనను తాను చెప్పుకున్న షర్మిలా ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కి ఆయుదం గా మారిపోవడమే విది విచిత్రం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube