షర్మిల కు ఎన్నో సవాళ్లు .. ఎన్నికలపై ఆమె నిర్ణయం ఏంటి ? 

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి వైఎస్ షర్మిల పెద్ద సాహసం చేశారు.ఆమెపై ఆంధ్రా ముద్ర ఉన్నా.

తాను తెలంగాణ ఆడబిడ్డనే అంటూ ఆమె గట్టిగానే చెబుతున్నారు.వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు.

నిరుద్యోగ దీక్షలతో పాటు , తెలంగాణ వ్యాప్తంగా ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే షర్మిల స్పందిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ను దొర దొర అంటూ సెటైర్లు వేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఆమె పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.మధ్యలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో యాత్రకు బ్రేక్ వేశారు మళ్లీ యాత్ర ఎప్పుడు మొదలు పెడతారో తెలియని పరిస్థితి.

Advertisement

అయితే తన పాదయాత్రలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని షర్మిల భావించినా, వాస్తవ పరిస్థితి మాత్రం దానికి విరుద్ధంగా ఉంది.మొదట్లో పార్టీలో చేరిన వారు ఒక్కొక్కరు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోవడం.

కొత్తగా పార్టీలో చేరే వారు కనిపించకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో షర్మిల ఉన్నారు.సోదరుడు జగన్ తో విభేదాలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది.

ఈ ఎఫెక్ట్ కూడా షర్మిల పార్టీ పై ఎక్కువగానే ఉంది.తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గం లో కీలకంగా ఉన్న కొంతమంది జగన్ తో సన్నిహితంగా మెలుగుతున్నారు.

  వారంతా షర్మిల పార్టీలో చేరాలని మొదట్లో భావించినా,  జగన్ మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారంతో వారు వెనకడుగు వేస్తున్నారట.అలాగే జగన్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇద్దరు మంచి స్నేహితులు కావడం, పరిపాలన విషయంలోనూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండడం ఇవన్నీ షర్మిల పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
వారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది .. కేటీఆర్ సెటైర్లు 

ఈ క్రమంలోనే పార్టీలో చేరికలు లేకపోవడం ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కకపోవడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై తన సన్నిహితులతో అనవసరంగా బలం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా వాటర్ ని  చేద్దామని అపకీర్తిని కట్టుకోవాలని, ఆ ప్రభావం పార్టీపై తీవ్రంగా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట.ఎన్నికల సమయం నాటికి పార్టీ పరిస్థితి పై ఒక అంచనాకు వచ్చి పోటీపై కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో షర్మిల ఉన్నట్టుగా పార్టీలో జరుగుతున్న చర్చ.

Advertisement

తాజా వార్తలు