మహావికాస్ ఆగాడీ ప్రభుత్వం ఒక చిన్న కేసు కారణంగా చిక్కుల్లో పడినట్లు తెలుస్తుంది.గత మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు కలిసి కూటమి గా ఏర్పడి మహావికాస్ అగాడీ పార్టీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఎల్గార్ పరిషత్ కేసు విషయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మహా సీఎం,శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే పై అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తుంది.ఎల్గార్ పరిషత్‌కు సంబంధించిన కేసును.
సీఎం ఉద్ధవ్ థాక్రే ఎన్‌ఐఏకి అప్పగించారు.దీనిపై శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే ఇదంతా కూడా ఆయన బహిరంగంగానే థాక్రే సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేయడం తో ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది.శాంతి భద్రతలు రాష్ట్రపరిధిలోని అంశమని గుర్తుచేసిన ఆయన.కేంద్రం ఆ పరిధిలోకి చొచ్చుకురావడం దారుణమన్నారు.శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సారథ్యంలో మహా వికాస్ అగాఢీ సేనగా ఏర్పడిన తర్వాత శరద్ పవార్… ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే తొలిసారి.
గతనెల్లోనే ఈ కేసును పుణె పోలీసుల నుంచి ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దీ రోజులకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ఈ కేసు విచారణ సిట్‌తోనే జరిపించాలంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ డిమాండ్ చేశారు.దీనికి భిన్నంగా సీఎం ఉద్ధవ్ ఎన్‌ఐఏకి అప్పగించడంపై పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
2018లో ఎల్గా పరిషత్ వేడుకల సందర్భంగా మావోయిస్టులకు ఫండ్ రైజింగ్, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు.అయితే ఇది అతిపెద్ద వేడుక కావడం, కొందరిని కావాలనే టార్గెట్ చేసి ఇలా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి.
ఆ తర్వాత ఇది పొలిటికల్ రంగు పులుముకుంది.ఇప్పుడిది ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.