ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ( YCP ) ఎన్నికల శంఖారావం పూరించనుంది.ఈ మేరకు విశాఖ జిల్లా భీమిలి నుంచి తొలి ఎన్నికల సభను ఏర్పాటు చేస్తుంది.
ఉత్తరాంధ్ర( Uttarandhra )లోని 34 నియోజకవర్గాల క్రియాశీలక కార్యకర్తలతో వైసీపీ అధినేత, సీఎం జగన్ సమావేశం కానున్నారు.ఇందులో భాగంగా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.ఈ క్రమంలోనే ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరనున్నారు.ఎన్నికల రణభేరిలో భాగంగా సిద్ధం పేరుతో వైసీపీ సభలను నిర్వహించనుంది.ఈ క్రమంలో భీమిలి సభకు సుమారు నాలుగు లక్షల మంది హాజరవుతారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.