తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ మల్లిక్ సాహసోపేత స్కై డైవ్ లో పాల్గొన్నాడు.అబుదాభి లో జరుగు స్కై డైవ్ విన్యాసాలలో శంకర్ మల్లిక్ పాల్గొన్నాడు.
స్కై డైవ్ అంటే ముందుగా చాప్టర్ ద్వారా నింగిలోకి వెళ్లి అక్కడ నుండి ఒక ట్రైనర్ సహాయంతో ఆకాశంలో విహారం చేస్తారు.వీరికి పారచుట్ సహాయంతో ఈ విన్యాసాలు జరుగుతాయి.ఈ విన్యాసాలు చూడటానికి మనకే ఎంతో భయం వేస్తోంది.అటువంటి విన్యాసాలు చేసే వ్యక్తి పరిస్థితి ఆలోచిస్తే మనకు ఒళ్ళు జలదిరిస్తుంది.అటువంటి విన్యాసం తుని ఎమ్మెల్యే తనయుడు మల్లిక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.మల్లిక్ చిన్నప్పటి నుండి క్రీడల పట్ల ఆశక్తి కలిగినవాడు ఏడవ తరగతి వరకు తునిలో చదివిన మల్లిక్ 8,9,10 తరగతులను వైజాగ్ లో పూర్తి చేసాడు.
ఉన్నత చదువుల కోసం దుబాయ్ వెళ్లిన మల్లిక్ అక్కడ కాలేజీ తరుపున అబుదాభి లో జరిగే విన్యాసాలు లో పాల్గొన్నాడు.ఇలాంటి సాహసోపేత విన్యాసాలలో పాల్గొన్న మల్లిక్ ధైర్యాన్ని చూసి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







