ఒక సినిమాని తీయాలంటే దానికి దర్శకుడు చాలావరకు కష్టపడాల్సి ఉంటుంది.ఎందుకంటే ఒక దర్శకుడు మేదో శక్తి వల్లే సినిమాలు రూపుదిద్దుకుంటాయి.
నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడు తన స్థాయిని అందుకుంటూ వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ శంకర్( Shankar ) కూడా తనదైన రీతిలో గ్రాఫిక్స్ తో మాయాజాలం చేయగల టాలెంట్ ఉన్న దర్శకుడు అని ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నాడు.

ఇక ఎప్పుడు రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో కూడా తను ఏంటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమా సక్సెస్ అయితే దర్శకుడు శంకర్ పాన్ ఇండియా లెవెల్లో మరొక భారీ సక్సెస్ అయితే అందుకుంటాడు.ఇక దాంతో పాటుగా పాన్ ఇండియా దర్శకులుగా కొనసాగుతున్న రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దర్శకులతో పాటు శంకర్ భారీ ఇమేజ్ ని అయితే మూట గట్టుకుంటాడు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటి అంటే శంకర్ ఎందుకు పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ కావాలనుకుంటున్నాడు అంటే తను నెక్స్ట్ షారుఖాన్( Shah Rukh Khan ) తో ఒక సినిమా చేయబోతున్నాడు.

ఇక దానికి ముందే పాన్ ఇండియాలో శంకర్ సూపర్ సక్సెస్ సాధిస్తే ఆ సినిమాకు చాలా వరకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాడు.అందుకోసమే తను పాన్ ఇండియా లో ఈ సినిమాతో దుమ్ము రేపాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటికే శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి మధ్యలో కొన్ని ప్లాప్ లు రావడం తో మరోసారి ఆయన సత్తా చూపించే సమయం అయితే వచ్చింది…మరి ఈ సినిమాతో ఆయన ఎంతవరకు సత్తా చాటుతారు అనేది కూడా తెలియాల్సి ఉంది…
.








