Shahrukh Khan: షారుఖ్ ఖాన్ గ్యారేజ్ లో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ఈ కారు ఖరీదు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.

 Shahrukh Khan New Hyundai Ioniq 5 Electric Car-TeluguStop.com

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు షారుఖ్ ఖాన్. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు.

కాగా ప్రస్తుతం షారుఖ్ ఖాన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.

Telugu Bollywood, Electric Car, Hyundai Car, Hyundai Ioniq, Shahrukh Khan, Shahr

కాగా షారుఖ్ ఖాన్ వద్ద కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు( Luxury Cars ) ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే అవన్నీ కూడా పెట్రోల్ డీజిల్ తో నడిచే కార్లు.కానీ షారుఖాన్ ఇటీవలే మొదటి ఎలక్ట్రిక్ కారుని( Electric Car ) కొనుగోలు చేశారు.

షారుఖ్ ఖాన్ వద్ద ఉన్న కార్ల కలెక్షన్స్ లో మొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే.హ్యుందాయ్ భారత మార్కెట్లోకి విడుదల చేసిన ఐయోనిక్ 5( Hyundai Ioniq 5 ) అనే ఒక ఎలక్ట్రిక్ కార్ ని విడుదల చేసింది.షారూఖ్ ఖాన్‌ కూడా ఈ కారుని కొనుగోలు చేశారు.ఇప్పటికే అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న షారుక్ ఖాన్‌ గ్యారేజిలో చేరిన మొదటి ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ ఐయోనిక్ 5 కావడం గమనార్హం.

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Telugu Bollywood, Electric Car, Hyundai Car, Hyundai Ioniq, Shahrukh Khan, Shahr

షారుఖ్ కూడా తన కొత్త ఎలక్ట్రిక్ కార్ విషయంపై స్పందిస్తూ.మొదటి సారి గ్యారేజిలో ఎలక్ట్రిక్ కారు చేరటం ఆనందంగా ఉందని, అందులోనూ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు చేరటం మరింత సంతోషంగా ఉందని షారుక్ వెల్లడించారు.అయితే భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఒక ఫుల్ ఛార్జ్‌తో 630 కిమీ రేంజ్ అందిస్తుంది.ఈ కారు 350 కిలోవాట్ డీసీ ఛార్జర్ ద్వారా 18 నిముషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది.హ్యుందాయ్ ఐయోనిక్ ఎలక్ట్రిక్ కారు ధర రూ.46 లక్షలుగా ఉంది.చాలామంది ఈ కార్ ధర తెలిసి షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube